Telangana Congress: ఆశ దోశ అప్పడం వడ..! పండక్కి పదవులు లేనట్టేనా.. టీపీసీసీ చీఫ్ ఏమన్నారో తెలుసా..?
ఆశదోశ అప్పడం వడ.. అన్నట్టుగా తయారైంది కాంగ్రెస్ నేతల పరిస్థితి. పండక్కి వస్తాయనుకున్న పదవులు.. ఇప్పట్లో దక్కేలా లేవు. ఈ విషయంలో పీసీసీ చీఫ్ క్లారిటీ ఇవ్వడంతో... ఉసూరుమంటున్నారు ఆశావహులు..
కార్పోరేషన్ పదవుల విషయంలో మాత్రం.. పెద్దగా ఆలస్యం కాకపోవచ్చని చెప్పారు పీసీసీ అధ్యక్షుడు. మిగిలిపోయిన నామినేటెడ్ పోస్టులను.. త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. కార్పోరేషన్ పోస్టుల భర్తీ ఎన్నికల కారణంగా వాయిదా పడిందన్న మహేష్‌కుమార్ గౌడ్.. వీలైనంత త్వరగా నామినేటెడ్ పోస్టుల భర్తీపై క్లారిటీ వస్తుందన్నారు. పార్టీలోకి మరికొన్ని చేరికలు కూడా ఉంటాయన్న పీసీసీ చీఫ్… ఆ తర్వాతే లెక్కలేసుకుని పదవుల పంపకం ఉంటుందనే విషయం చెప్పకనే చెప్పారన్నమాట.
అయితే, ఇప్పటికే పదవులపై గంపెడాశలు పెట్టుకున్న కాంగ్రెస్ నాయకులు.. మహేష్‌కుమార్ గౌడ్ కామెంట్స్‌తో నీరసపడిపోయారు. పండగపూట పదవులు తీసుకుని.. దావత్ చేసుకుందామనుకున్న నేతలు.. మరికొన్ని రోజులు వెయిటింగ్ తప్పదన్న సమాచారంతో నిరాశలో కూరుకుపోయారట. అప్పటికి అదృష్టం వరించేదెవరినో.. దురదృష్టం వెంటాడేదెవరినో చూడాలి.