పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు 94 ఏళ్ల వయసులో కన్నుమూశారు

 


Gussadi Kanaka Raju: గుస్సాడీ కళాకారుడు కనకరాజు కన్నుమూత.. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి సంతాపం 

ప్రముఖ గుస్సాడీ నృత్యకళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు 94 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గుస్సాడీ నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుది శ్వాస విడిచారు. గిరిజన సంప్రదాయ కళారూపాన్ని కాపాడినందుకు ఆయనకు ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. పద్మశ్రీ గ్రహీత, ప్రముఖ గుస్సాడీ కళాకారుడు కనకరాజు కన్నుమూశారు.. వయోభారం, దీర్ఘకాలికి అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న గుస్సాడీ కళాకారుడు కనకరాజు శుక్రవారం (అక్టోబర్ 25) సాయంత్రం కన్నుమూశారు. శనివారం మధ్యాహ్నం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి స్వగ్రామంలో ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. గిరిజనుల సంప్రదాయ గుస్సాడీ నృత్యానికి జీవం పోసిన కనకరాజు మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. పద్మశ్రీ గ్రహీత, ప్రముఖ గుస్సాడీ కళాకారుడు కనకరాజు మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు సీఎం. అధికారిక లాంఛనాలతో ఇవాళ అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow