తెలంగాణ రాజకీయ వర్గాలు ఎప్పుడెప్పుడూ అని ఎదురుచూస్తున్న కేబినెట్ విస్తరణ త్వరలోనే జరగబోతోందా?. త్వరలోనే ఈ ప్రక్రియ షురూ కానుందా? ఈ మేరకు ముహూర్తం ఖరారైందా? అనే సందేహాలకు ఔననే సమాధానం వస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ (బుధవారం) ఢిల్లీకి వెళ్లనున్న నేపథ్యంలో ఈ ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ వర్గాలు ఎప్పుడెప్పుడూ అని ఎదురుచూస్తున్న కేబినెట్ విస్తరణ త్వరలోనే జరగబోతోందా?. త్వరలోనే ఈ ప్రక్రియ షురూ కానుందా? ఈ మేరకు ముహూర్తం ఖరారైందా? అనే సందేహాలకు ఔననే సమాధానం వస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ (బుధవారం) ఢిల్లీకి వెళ్లనున్న నేపథ్యంలో ఈ ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కసరత్తు మొదలైందా అనే చర్చ జోరుగా నడుస్తోంది. రేపు సాయంత్రం కాంగ్రెస్ అధిష్టానంలో రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతారని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. నామినేటెడ్, ఎమ్మెల్సీ స్థానాల భర్తీ, పీసీసీ చీఫ్ నియామకం పూర్తవ్వడంతో ప్రస్తుతం అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపైనే పడింది.
డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో 6 కేబినెట్ బెర్తులు ఖాళీగా ఉన్నాయి. హోం మంత్రిత్వశాఖ, మున్సిపల్, విద్య, మైనింగ్‌తో పాటు పలు కీలక శాఖలు సీఎం వద్దే ఉన్నాయి. కాగా కేబినెట్‌లో చోటు కోసం పలువురు సీనియర్ల ప్రయత్నాలు చేస్తున్నారు.
రేసులో ఉన్నది ఎవరు?
తెలంగాణ కేబినెట్ విస్తరణలో పలువురు సీనియర్ మంత్రి పదవులు ఆశిస్తు్న్నారు. రేసులో ఉన్న నేతల విషయానికి వస్తే ఆదిలాబాద్ నుంచి గడ్డెం బ్రదర్స్, మంచిర్యాల నుంచి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి ఉన్నారు. వీరితో పాటు నల్గొండ జిల్లా నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి మక్తల్ ఎమ్మె్ల్యే శ్రీహరి ముదిరాజ్, మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ, అజారుద్దీన్ అమాత్య పదవులను ఆశిస్తు్న్నారు. మరి వీరిలో ఎవరిని పదవులు వరించనున్నాయి?, అనూహ్యంగా ఇంకెవరైనా రేసులోకి వచ్చి పదవులు దక్కించుకుంటారా? అనేది చూడాల్సి ఉంది.
మరోవైపు ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రేపు (గురువారం) భేటీ కానున్నారు. వరద నష్టం అంచనా విరాలు చెప్పి కేంద్ర సాయం కోరనున్నారు.
