TG News: లైంగిక వేధింపుల కారణంగా.. 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
ప్రస్తుతం సమాజంలో చిన్న పిల్లలు లేరు.. పెద్దవాళ్లు లేరు.. ఆడపిల్ల అయితే చాలు.. వారిపై దారుణమైన అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. పసికందులను సైతం వదలడం లేదు.
హైదరాబాద్: ప్రస్తుతం సమాజంలో చిన్న పిల్లలు లేరు.. పెద్దవాళ్లు లేరు.. ఆడపిల్ల అయితే చాలు.. వారిపై దారుణమైన అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. పసికందులను సైతం వదలడం లేదు. తాజాగా ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. కూల్ డ్రింక్ షాప్‌లో పని చేస్తున్న వ్యక్తి సదరు విద్యార్థిని ప్రేమ పేరిట లైంగికంగా వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. దీంతో ఆ విద్యార్థిని భరించలేకపోయింది. ఆత్మహత్యే శరణ్యమనుకుంది.
జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. లైంగిక వేధింపుల కారణంగా బాలిక ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ పేరుతో విద్యార్థినిని శివ అనే 20 ఏళ్ల యువకుడు లైంగిక వేధింపులకు గురి చేశాడు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్‌లో విద్యార్థిని కుటుంబం నివాసముంటున్నారు. ప్రస్తుతం విద్యార్థిని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ హాస్టల్లో ఉంటూ 9వ తరగతి చదువుకుంటోంది. కొన్ని కారణాల వల్ల ఇటీవలే బాలాజీ నగర్‌లోని తమ నివాసానికి విద్యార్థిని వచ్చింది. ఆమెను చూసిన శివ వేధింపులు ప్రారంరభించాడు.
శివ కూల్ డ్రింక్ షాపులో పని చేస్తున్నాడు. విద్యార్థిని కనిపిస్తే చాలు.. వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. ప్రేమ పేరుతో లైంగికంగా వేధించడంతో వేధింపులు భరించలేక గత రాత్రి ఉరి వేసుకుని విద్యార్థిని తనువు చాలించింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని, యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం బాలిక మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్‌కి పోలీసులు తరలించారు.