HYDRA: రంగనాథ్‌కి స్పీడెక్కువ.. ఎమ్మెల్యే కూనంనేని

 

HYDRA: రంగనాథ్‌కి స్పీడెక్కువ.. అలా చేస్తే హైడ్రా నిజంగానే డ్రాగన్ అవుతుంది.. ఎమ్మెల్యే కూనంనేని సంచలన వ్యాఖ్యలు

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ గురించి తనకు తెలుసని.. రంగనాథ్‌కి స్పీడ్ ఎక్కువంటూ కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. అత్యుత్సాహం కూడా కొన్నిసార్లు ఇబ్బందే అవుతుందని.. సామాన్యుల ఇళ్లు కూలుస్తున్నారని ఆవేదని వ్యక్తంచేశారు.


తెలంగాణలో హైడ్రా ప్రకంపనలు కొనసాగుతున్నాయి.. జూన్ 27నుంచి తెలంగాణలో హైడ్రా సంస్థ ఆక్రమణల తొలగింపు చేపట్టింది. ఇప్పటిదాకా 43ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ ఆపరేషన్‌లో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. తమకు ఓవైసీ అయినా.. మల్లారెడ్డి అయినా ఒక్కటేనని పేర్కొన్నారు. ఈ తరుణంలోనే.. సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హైడ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా అంటే ఒక భయానకమైన పేరంటూ కూనంనేని పేర్కొన్నారు. జనం గుండెల్లో దడ పుట్టించేలా ఉందన్నారు. హైడ్రా అంటే ఎంటర్ ది డ్రాగన్ అనే పదం విన్నాం.. అలాంటి పేరుతో ప్రభుత్వం రంగంలోకి దిగింది.. హైడ్రా అంటే జనాలకు దడపుడుతోంది.. నిర్దిష్టమైన ప్రణాళికతో ఉపయోగించకపోతే.. హైడ్రా నిజంగానే డ్రాగన్ అవుతుందంటూ కూనంనేని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ గురించి కూడా కూనంనేని మాట్లాడారు.. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ గురించి తనకు తెలుసని.. రంగనాథ్‌కి స్పీడ్ ఎక్కువంటూ పేర్కొన్నారు. అత్యుత్సాహం కూడా కొన్నిసార్లు ఇబ్బందే అవుతుందని.. సామాన్యుల ఇళ్లు కూలుస్తున్నారని ఆవేదని వ్యక్తంచేశారు. పెద్దవాళ్ల విషయంలోనూ అలాగే వ్యవహరించాలంటూ కూనంనేని సాంబశివరావు సూచించారు. అప్పట్లో వీటికి పర్మిషన్ ఇచ్చిన వారిలో అధికారులు, మంత్రులు కూడా ఉంటారని.. వారందరినీ బయటకు తీయాలని కూనంనేని డిమాండ్ చేశారు.. పేద వాళ్లు, సమాన్యుల ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దంటూ సూచించారు.

ఆడబిడ్డను రాజకీయాల్లోకి లాగడమెందుకు?..

కవిత రిలీజ్‌ను కూడా రాజకీయం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే కూనంనేని పేర్కొన్నారు. కవిత ఓ మహిళ.. ఆమెపై అంత కక్ష ఎందుకు.. మహిళను వేధింపులకు గురిచేయడం కరెక్ట్ కాదన్నారు. కావాలంటే కేసీఆర్.. కేటీఆర్‌తో రాజకీయం చేయండి.. ఆడబిడ్డను రాజకీయాల్లోకి లాగడమెందుకు? కవిత విషయంలో కాంగ్రెస్, బీజేపీ రాజకీయం చేయడం కరెక్ట్ కాదంటూ కూనంనేని పేర్కొన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال