గ్రామరాజ్యాలను బీసీల చేతుల్లో పెడతారా?
మన వాటా బాటలో...
గ్రామరాజ్యాలను బీసీల చేతుల్లో పెడతారా?
బీసీలం.. బహుజనులం
అన్ని పోరాటాల్లో చిందిన నెత్తురంతా బీసీలదే.
అన్ని ఉద్యమాలకు వూపిర్లు బీసీలే
బీసీ యోధుల చరిత్రను కనుమరుగు చేసిన చరిత్రకారులు .... 1
బీసీలను గ్యారంటీ పథకాలుగా మార్చిన ఆధిపత్యవర్గాలు ......
మనం ఐక్యం కాకుండా ఆధిపత్యవర్గాల కుట్ర
నీ కోసం నువ్వే నిలబడాలి.
ఇంకెంతకాలం విన్నపాలు
త్యాగాలు మనయి - అధికారాలు వాళ్ళయా?
మనల్ని వేరు చేసే వారిని ఎక్స్రే తీయాలి.
మనల్ని విడదీసే వాదనలు తెచ్చేవారిని ఓ కంట కనిపెట్టాలి...18
మన ఓట్లు మనమే వేసుకుంటే చాలు
ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపిస్తేనే కులగణనలా?.
బీసీలకు మీరేం చేశారు?
బీసీ కమిషన్ల సిఫారసులను తుంగలోతొక్కిన పాలకులు,
దేశం ఆత్మను చంపేసే నాయకులు మనకొద్దు.
బీసీలు ప్రశ్నించుకోవాలి
మనవాటా మనకు దక్కాలి.
అగ్రవర్ణాల ఆధిపత్యాల కోసం బీసీ కార్డు.
పాలించే అర్హత ఆధిపత్యకులాలకే ఉందా?.
మన కోసం మనమే నిలవాలి
బీసీ విద్యావంతుల వేదికలు రావాలి
భిన్నభావజాలాల బీసీలు ఒక్కటి కావాలి.
బీసీ కులగణన మనందరి ఐక్యతానివాదం
కులగణనపై విషంగక్కుతున్న ఆధిపత్య సంస్కృతి.
అగ్రకులాలకు కులగణనపై ఎందుకింత ద్వేషం
కులగణన, చట్టసభల్లో రిజర్వేషన్లకై గొంతెత్తాలి.
ఆటగాళ్ళు మారటం కాదు ఆట మారాలి
ఎంబీసీలకు సమవాటా దక్కాలి.
రాజ్యాంగబద్ధంగా ఏ హక్కులకు నోచుకోక చట్టసభల్లో ప్రాతినిధ్యాలు లేక దేశజనాభాలో సగానికి పైగా వున్న బీసీల అపరిష్కృత సమస్యల్ని పరిష్కరిస్తామని కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన వాగ్దానం విస్తృతంగా ప్రచారం చేసింది. కులగణన, బీసీ కమీషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు, స్థానిక సంస్థల్లో ప్రస్తుతమున్న రిజర్వేషన్లు 23 శాతం నుంచి 42 శాతానికి పెంపు ద్వారా పంచాయితీ, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఉపవర్గీకరణ చేస్తామని 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రధానాంశంగా పెట్టింది. 77 ఏళ్ళ స్వాతంత్య్ర పాలనలో ఇప్పటికీ అన్ని రకాల స్వాతంత్ర్యాలు పొందని బీసీలు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చేసిన వాగ్దానాల వైపుకు ఆశగా చూశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరునెలలు దాటింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాంగ్రెస్ చేసిన వాగ్దానం నిలబెట్టుకుని కులగణన, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపు చేయాలని సగం తెలంగాణగా వున్న 2 కోట్ల మంది బీసీలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఈపని చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే బీసీ కులాల నుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కోకతప్పదు. బీసీ మ్యానిఫెస్టోను ఆ పార్టీలోని ఆధిపత్యవర్గాలు అమలు చేయనిస్తాయా అన్నది తెలంగాణ సమాజం ముందు పెద్ద ప్రశ్నగా ఉంది. ఇది కాంగ్రెస్ కు సవాల్ మారనుంది. బడుగులకు జీవన్మరణ సమస్య అంటూ బీసీలు భగ్గుమంటున్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ల ద్వారా కాంగ్రెస్ చెబుతున్నట్లు 23,973 మంది యువబీసీ నాయకత్వాలు వస్తాయి. నేటికినీ గ్రామాల్లో పెత్తనాలు చెలాయించే ఆధిపత్యవర్గాలు స్థానిక రాజ్యాలను బీసీల చేతుల్లో పెడితే ఒప్పుకుంటారా అన్న సవాలక్ష ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. ఇది ఎన్నికల్లో గెలవటానికి కాంగ్రెస్ చేసిన వాగ్దానమా? లేక చిత్తశుద్ధితో
మా వాటా మాకే 7