సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు.. RDO మరియుజడ్చెర్ల తహసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చిన నసురుల్లాబాద్ తాండ వాసులు.


నసురుల్లాబాద్ గ్రామానికి మంజూరైన సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు నస్రుల్లాబాద్ తాండ గ్రామపంచాయతీ పరిధిలోని సర్వేనెంబర్ 526 లో నిర్మించుటకు చొరవ తీసుకోవాలని RDO మరియు స్థానిక తహసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చిన నసురుల్లాబాద్ తాండ గ్రామపంచాయతీ వాసులు,

.

గత ప్రభుత్వ హయాంలో నసురుల్లాబాద్ గ్రామానికి సబ్ స్టేషన్ మంజూరై స్థలం లేనందువలన తిరిగి ఇప్పుడు సబ్స్టేషన్ నిర్మాణం కొరకు అనుమతులు ఇవ్వడం జరిగింది.

  ప్రభుత్వ స్థలము ఉన్న సర్వే నెంబర్ 526 లో సబ్స్టేషన్ నిర్మాణం జరిగితే వెనుకబడ్డ నసురుల్లాబాద్ తాండ, గ్రామపంచాయతీ అభివృద్ధి చెందుతుంది అని తండావాసులు అభ్యర్థించినారు.

 నస్రుల్లాబాద్ గ్రామంలో స్థలం లేకున్నా కొందరు నాయకులు రాజకీయ కక్షతో వ్యవసాయం చేస్తున్న అసైన్డ్ పట్టాభూమినీ అన్యాయంగా దౌర్జన్యంగా తీసుకొని రైతుల నోట్లో మట్టి కొడుతూ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసి వారి ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నారు,.



మరి గ్రామంలో ప్రభుత్వ భూమి ఉన్న ఈ రోజు కక్ష సాధింపు చర్యలకు దిగడం అనేది మంచి పద్ధతి కాదు, అసైన్డ్ భూములను,స్మశాన వాటికలను కొల్లగొట్టే హక్కు ఎవరికీ కూడా లేదు లేనిపక్షంలో చట్టరీత్యా తగు చర్యలు తీసుకొనబడును.

మాజీ సర్పంచ్ శంకర్ నాయక్,మాజీ వార్డ్ మెంబెర్స్ రాజేష్,అగ్గిరం,రమేష్,రాజు,పెంట్య నాయక్ గ్రామస్తులు

 మాజీ సర్పంచ్ శంకర్ నాయక్,మాజీ వార్డ్ మెంబెర్స్ రాజేష్,అగ్గిరం,రమేష్,రాజు,పెంట్య నాయక్ గ్రామస్తులు

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow