
టీ20 వరల్డ్ కప్ నుంచి మరో సీనియర్ ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే భారత్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ , రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలికారు. న్యూజీలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బోల్ట్ టీ20 లను లకు గుడ్ బై చెప్పేశాడు. ఈ లిస్టులో బంగ్లాదేశ్ వెటరన్ ఆల్-రౌండర్ మహ్మదుల్లా రియాద్ చేరాడు. వరల్డ్ కప్ ఓటమి తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుండి అధికారికంగా రిటైర్మెంట్ అవుతున్నట్టు తన నిర్ణయాన్ని తెలియజేశాడు.
వెస్టిండీస్,అమెరికా వేదికలపై ఇటీవలే జరిగిన టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ సూపర్ 8 లో నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. దీంతో మహ్మదుల్లా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది. 17 ఏళ్లుగా బంగ్లాదేశ్ తరపున ఆడిన ఈ ఆల్ రౌండర్ ఓటమితో వీడ్కోలు పలికాడు. 2007లో శ్రీలంకపై అరంగేట్రం చేసిన మహ్మదుల్లా బంగ్లాదేశ్ తరపున 50 టెస్టులు, 232 వన్డేలు, 138 టీ20 మ్యాచ్ లాడాడు.
మూడు ఫార్మాట్ లలో కలిపి 10,000 పైగా పరుగులు చేశాడు. బౌలింగ్ లోనూ రాణించి 150 కి పైగా వికెట్లు తీసుకున్నాడు. లోయర్ ఆర్డర్ లో వచ్చి బంగ్లా సాధించిన ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2015 లో బంగ్లాదేశ్ తొలిసారిగా క్వార్టర్-ఫైనల్‌కు అర్హత సాధించడంలో మహ్మద్దుల్లాదే ప్రధాన పాత్ర. ఈ టోర్నీలో ఇంగ్లాండ్(103), న్యూజిలాండ్(128) సెంచరీలు చేశాడు. టీ20 జట్టుకు కెప్టె గా చేసిన మహ్మద్దుల్లా.. 2018లో జరిగిన నిదాహాస్ ట్రోఫీలో జట్టును ఫైనల్ కు చేర్చాడు.
🚨 BREAKING NEWS
— Cricket Trends. (@CricketTrends0) July 1, 2024
🇧🇩 Bangladesh's all-rounder Mohammad Mahmudullah Riyad retired from International Cricket.
His International Career consists of👇
50 Test || 232 ODIs || 138 T20Is
Thank you legend. ❤️ pic.twitter.com/TyD1SIUaBS
from V6 Velugu https://ift.tt/FtXg1cu
via IFTTT