big flash news బస్సు దగ్ధం ప్రయాణికులకు స్వల్ప గాయాలు

, జడ్చర్ల: డీసీఎంను ఢీకొని ఆర్టీసీ బస్సు దగ్ధమైన ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చల్ సమీపంలో బురెడ్డిపల్లి


వద్ద ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ధర్మవరం డిపోకు చెందిన సూపర్ డీలక్స్ బస్సు,


హైదరాబాద్ నుంచి 36 మంది ప్రయాణికులతో ధర్మవరం వెళ్తుం


ది. జడ్చర్ల పట్టణంలోని బురెడ్డిపల్లి చౌరస్తాలో


యూటర్న్ తీసుకుంటున్న డీసీఎంను బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సుకు


మంటలు అంటుకొని బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన వెంటనే గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులకు ఏం


జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు ప్రమాద స్థలానికి వెళ్లి బస్సులోని


ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో ప్రయాణికులంతా బస్సులోంచి దిగిపోవడంతో పెను ప్రమాదం


సంభవించింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల


సమచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ సీఐ ఆదిరెడ్డి సహాయక చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఫైర్


సిబ్బంది ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని బస్సుకు అంటుకున్న మంటలను ఆర్పివేశారు. ఈ మేరకు గాయపడిన


ప్రయాణికులను జడ్చర్ల, మిడ్జిల్, భూత్పూర్, నవాబుపేట, హన్వాడ అంబులెన్స్లలో జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స


అందజేశారు.

Previous Post Next Post

نموذج الاتصال