రాష్ట్రంలోని నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరువల్ల నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సర్కారు ఉద్యోగాల భర్తీ హర్షనీయమైన నిరుద్యోగుల డిమాండ్లు మరియు విజ్ఞప్తులు పరిగణలోకి తీసుకొని సానుకూలంగా స్పందించి డీఎస్సీని వాయిదా వేయాలని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీనివాస్ సాగర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు..
ప్రభుత్వం ఉద్యోగుల భర్తీ విషయంలో తీసుకుంటున్న విషయంలో స్వాగతిస్తూ ప్రిపరేషన్ విషయంలో సమయం లేనందున, పరీక్షలకు పరీక్షలకు మధ్య ఎక్కువ సమయం లేనందున, టీచర్ ఉద్యోగులకు సంబంధించి సిలబస్ బాగా పెరిగినందున వాయిదా వేయాలని ఆయన కోరారు.
పదేళ్లపాటు ఉద్యోగాల కోసం వేచి ఉండటంతో నిరుద్యోగ యువతలో ఆత్రుత ఆందోళన పెరిగాయి, వరుస పరీక్షల నిర్వహణ షెడ్యూలు ఇప్పటికే ప్రకటించిన పోటీ పరీక్షలపై నిర్ణయించుకోలేని స్థితిలో నిరుద్యోగులు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్నారు..
ప్రభుత్వం ఇప్పటికైనా నిరుద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వ పరంగా స్పందించడం లేదా ఉద్యమాలు చేపడుతున్న సంఘాల ప్రతినిధులతో చర్చించి సమస్యను పరిష్కరించి ముందుకు వెళ్లాలని శ్రీనివాస్ సాగర్ కోరారు..