గంజాయి అమ్ముతున్న మహిళను అరెస్టు చేసిన మందమర్రి పోలీసులు..*

 *


       ......*1.1 కిలోల గంజాయి స్వాధీనం*


గుట్టుచప్పుడు కాకుండా మందమర్రి పట్టణం లో గంజాయి అమ్ముతున్న మందమర్రి చెంచు కాలనీకి చెందిన గుర్రాల అనిత అనే మహిళను బుధవారం మందమర్రి పోలీసులు అరెస్టు చేశారు.

బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం....

మందమర్రి పట్టణం విద్యానగర్ కు చెందిన గుర్రాల అనిత అనే మహిళ తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆశతో ప్రభుత్వ నిషేధిత గంజాయని విక్రయించాలని నిర్ణయించుకొని , మక్కల గంగాధర్ , నివాసం విద్యానగర్ మందమర్రి అనే యువకుడుకి కొంత డబ్బు ఇచ్చి గంజాయి తీసుకురమ్మని చెప్పగా, అతను చంద్రపూర్ కి వెళ్లి రెండు కిలోల గంజాయి తీసుకువచ్చి అనితకి ఇచ్చాడు. అనిత ఆమె దగ్గరికి వచ్చే కొంతమంది  తెలియని వినియోగదారులకి ఒక్కొక్క ప్యాకెట్ 300 రూపాయల చొప్పున అమ్మి లాభాలు పొందేది. ఈరోజు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు గుర్రాల అనిత నివాసం యొక్క పరిసర ప్రాంతాలలో తనిఖీ చేయగా ఆమె వద్ద ఒక 1 కిలో 100 గ్రాముల గంజాయి లభించింది. అట్టి అట్టి గంజాయిని సాధన పరచుకొని గుర్రాల అనితను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం అయినది. బెల్లంపల్లి సబ్ డివిజన్ ప్రజలకు తెలియజేయునది ఏమనగా ప్రభుత్వ నిషేదిత గంజాయిని అమ్మిన కొన్న సేవించిన మరియు రవాణా చేసిన వారి పైన కఠినమైన చర్యలు తీసుకొని, వారిని జైలుకు పంపడం జరుగుతుంది మరియు వారి పైన షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుందని బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ హెచ్చరించారు. మంచిర్యాల డిసిపి గారి సూచన మేరకు ఏసిపి బెల్లంపల్లి గారి ఆధ్వర్యంలో నేరస్థురాలుని మరియు గంజాయిని పట్టుకున్న కే శశిధర్ రెడ్డి సిఐ మందమర్రి, ఎస్ రాజశేఖర్ ఎస్ఐ మందమర్రి, హెడ్ కానిస్టేబుల్ రాము,గోపి కృష్ణ, సంపత్, మహిళ హెడ్ కానిస్టేబుల్ పద్మ, హోంగార్డ్ ఆఫీసర్ ఉమా లను రామగుండం గౌరవ సి పి, ఎం. శ్రీనివాస్ ఐ పి ఎస్, ఐజి  అభినందించినారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow