బీర్ బాటిల్ సిగిరెట్ పీకలు దర్శనమిచ్చాయి.
సంస్థాననారాయణపురం, జూలై 18: బీర్ బాటిల్ సిగిరెట్ పీకలు దర్శనమిచ్చాయి. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాననారాయణపురం మండలకేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని సరళమైసమ్మ వై న్సలో కొందరు యువకులు బీరు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన బీరు బాటిల్ పరిశీలించగా అందులో సిగిరెట్ పీకలు ఉన్నాయి. దాంతో పాటు బాటిల్లో దుమ్ముధూళి ఉంది. బాటిల్‌లో సిగిరెట్, దుమ్ముధూళితో ఉందని వైన్స సిబ్బందిని ప్రశ్నించ గా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని యువకులు ఆరోపించారు. నాణ్యత లేని బీరు బాటిల్ విక్రయిస్తున్న వైన్సపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మద్యం ప్రియులు వైన్స ఎదుట ఆందోళన చేసి నిరసన తెలిపారు. నాణ్యతలేని మద్యాన్ని విక్రయిస్తున్న వైన్సులపై ఆబ్కారీ శాఖ అధికారులు నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.