*జడ్చర్ల..
*మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల*
*సింధూర టిఫిన్స్ సెంటర్ కు3000 జరిమానా*
జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ సొంటే రాజయ్య జడ్చర్ల మున్సిపల్ పరిధిలోని సింధూర హోటల్ ముందు ఉన్న సింధూర టిఫిన్ సెంటర్ నందు ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించడం జరిగినది. అపరిశుభ్రంగా ఉండడంతో పాటు ఆహారంలో నాణ్యత లేకపోవడం వలన హోటల్ యజమానికి 3000 రూపాయలు జరిమానా
విధించారు.వర్షాకాలం ఉన్నందున (డెంగు ,మలేరియా, కలరా) వివిధ వ్యాధులు ప్రబలే అవకాశాలు వున్నాయి. కాబట్టి హోటల్స్ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలి లేనియెడల 50,000/- రూపాయల వరకు పెనాల్టీ విధించబడును అని తెలియజేయడం జరిగినది. శ్రీ నాగేష్ శానిటేషన్ ఇన్స్పెక్టర్, శ్రీ శివకుమార్ జూనియర్అసిస్టెంట్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
