గాంధీ ట్రస్ట్ ఆలయ భూములకు విముక్తి లభించేనా..?

జడ్చర్లలో  లోకాయుక్త విచారణ షురూ. 

మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో గల గాంధీ ట్రస్ట్,  వెంకటేశ్వర స్వామి భూముల అన్యాక్రాంతం పై లోకాయుక్త విచారణ ప్రారంభించింది. 



గాంధీ ట్రస్ట్ వెంకటేశ్వర స్వామి భూముల పైన లోకాయుక్త హైకోర్టు సుప్రీంకోర్టులు పోరాడుతున్న జడ్చర్ల పట్టణానికి చెందిన అనిల్ వేసిన పిటీషన్లపై విచారణ చేసేందుకు లోకాయుక్త అధికారులు గురువారం జడ్చర్ల పట్టణానికి విచ్చేసి మండల రెవెన్యూ తాసిల్దార్ కార్యాలయంలో సమావేశం అయ్యారు  అనంతరం గాంధీ ట్రస్ట్ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణాన్నికి  వెళ్లి. ఇక్కడ ఉన్న పరిస్థితులను చూసి విచారణ చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ లోకాయుక్త ఆదేశాల మేరకు విచారణ చేయడానికి వచ్చాము ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత ఈ భూములకు సంబంధించిన అన్ని దస్తావేజులు సేకరించి క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత అందరికీ నోటీసులు ఇస్తామని దీనిపైన మళ్లీ విచారణ ఉంటుంది అని తెలిపారు అలాగే అన్యాయంగా నిర్మించిన భవనాలన్నింటిని ఎందుకు కూల్చి వేయలేదు అని మున్సిపల్ కమిషనర్ను ప్రశ్నించారు. 

వెంకటేశ్వర స్వామి ఆలయ భూములపై సర్వే చేశారా హద్దులు ఎక్కడెక్కడ ఉన్నాయి అలాగే ఏమైనా నిర్మాణాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

 ఈ కార్యక్రమంలో విచారణ అధికారి వి ముత్యపు రావ్ డీఎస్పీ విద్యాసాగర్ బృందంతోపాటు మహబూబ్ నగర్ జిల్లా ఆర్డీవో జడ్చర్ల మండల తాసిల్దార్ డిప్యూటీ తాసిల్దార్ మున్సిపల్ కమిషనర్ రెవిన్యూ సర్వే, దేవాదాయ శాఖ అధికారులు ఇతర సిబ్బంది  పాల్గొన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me