💥 *పాలమూరు విద్యార్థినికి డాక్టరేట్*
💥 *కెమిస్ట్రీలో డాక్టరేట్ పట్టా*
💥 *ఉస్మానియా నుండి డాక్టరేట్*
💥 *డాక్టర్ పట్టా పొందిన మద్దూర్ స్వాతికి ప్రశంసల వెల్లువ*
మహబూబ్ నగర్ పట్టణంలోని గోల్డ్ పార్క్ కాలనీకి చెందిన మద్దూర్ స్వాతి డాక్టరేట్ పొందారు. హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో కెమిస్ట్రీ విభాగంలో పలు అంశాలలో పరిశోధనలు చేపట్టారు. ఈ అంశంలో ప్రత్యేకించి ప్రత్యేక పరిశోధనలు చేపట్టడంతో మద్దూరు స్వాతి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ పట్టాను పొందారు. ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకుడు శివరాజ్ ఆధ్వర్యంలో స్వాతి పరిశోధనలు చేపట్టారు. కెమిస్ట్రీ విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి మద్దూర్ స్వాతి డాక్టరేట్ పట్టాను పొందడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Tags
News@jcl