Hyderabad: ఇదోరకం మోసం.. సోదరుడు అరెస్ట్‌ అయ్యాడని చెప్పి..

 


కతార్‌లో ఉంటున్న మీ సోదరుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారని, వెంటనే డబ్బు పంపాలని ఓ మహిళను భయపెట్టిన సైబర్‌ నేరగాడు ఆమె నుంచి రూ. 2లక్షలు కాజేశాడు. మెహిదీపట్నం ప్రాంతం లో ఉంటున్న మహిళ (38) సోదరుడు కతార్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.

హైదరాబాద్‌ సిటీ: కతార్‌లో ఉంటున్న మీ సోదరుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారని, వెంటనే డబ్బు పంపాలని ఓ మహిళను భయపెట్టిన సైబర్‌ నేరగాడు(Cybercriminal) ఆమె నుంచి రూ. 2లక్షలు కాజేశాడు. మెహిదీపట్నం ప్రాంతం లో ఉంటున్న మహిళ (38) సోదరుడు కతార్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. మహిళకు వాట్సప్‌ కాల్‌ చేసిన సైబర్‌ నేరగాడు ఆమె సోదరుడి స్నేహితుడిగా పరిచయం చేసుకున్నాడు. ‘మీ సోదరుడికి వీసా సమస్య వచ్చింది.

పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాపాడాలంటే వెంటనే రూ.2లక్షలు పంపాలి..’ అని తొందరపెట్టాడు. ఆ మాటలు నమ్మిన మహిళ అతడు సూచించిన ఖాతాకు రూ. 2లక్షలు బదిలీ చేసింది. తర్వాత సోదరుడిని సంప్రదించగా తాను ఎలాంటి సమస్యలో లేనని చెప్పడంతో మోసపోయానని గ్రహించి సైబర్‌ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేసింది.

Previous Post Next Post

نموذج الاتصال