Kalki Part 2 Update: కల్కి పార్ట్ 2 షూటింగ్ 60 శాతం కంప్లీట్ అయ్యింది: నిర్మాత అశ్వినిదత్

Caption of Image.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898AD బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ చూసి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. భారీ విజువల్స్, యాక్షన్ పార్ట్, మహాభారతం సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. దీంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఎగబడుతున్నారు. దీంతో.. కల్కి మొదటి రోజే ఏకంగా రూ.191 కోట్ల  గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇక రెండు రోజులు కలుపుకొని ఏకంగా రూ.298.5 కోట్లు వసూలు చేసింది. ఇదే విషయాన్ని తాజాగా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇక సినిమా చివర్లో సీక్వెల్ గురించి హింట్ ఇచ్చాడు దర్శకుడు నాగ్ అశ్విన్. దాంతో.. కల్కి సినిమా సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆడియన్స్ ఇప్పటినుండే ఎదిరిచూస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు చిత్ర నిర్మాత అశ్విని దత్.  

తాజాగా ఆయన పత్రికా రిపోర్ట్రర్స్ తో మాట్లాడుతూ.. కల్కి పార్ట్ 2 షూటింగ్ ఇప్పటికే 60 శాతం కంప్లీట్ అయింది. మిగిలిన షూటింగ్ త్వరలోనే పూర్తి చేస్తాం. షూట్ కంప్లీట్ అయ్యాకే రిలీజ్ డేట్ గురించి ఆలోచిస్తాం.. అంటూ  చెప్పుకొచ్చారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. వచ్చే సంవత్సరం కల్కి పార్ట్ 2 వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.


from V6 Velugu https://ift.tt/M2OjZEv
via IFTTT
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow