ఇది చూశారా....
జడ్చర్ల మున్సిపాలిటీలో భారీ అవినీతి...
ప్రభుత్వ సొమ్ము పత్రికల పాలు...
అధికారులు పాలకుల అవినీతి మార్కు....
ప్రభుత్వం ప్రజా మౌలిక సదుపాయాల కోసం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను ఎలా దుర్వినియోగం చేశారో మున్సిపల్ ఎజెండా చూస్తే అర్థమవుతుంది.
పత్రికలలో ప్రకటనల కోసం లక్షల రూపాయలు గుమ్మరించి అవినీతికి పాల్పడ్డారు. అవి కూడా ప్రజాప్రయోజనం కోసం ఇచ్చిన ప్రకటనలు కూడా ఎంత మాత్రం కావు. జనాదరణ పొందిన పత్రికలకు ఇచ్చిన ప్రకటనలు అంతకంటే కావు. భూతద్దం పెట్టి వెతికిన కానరాని పత్రిక సైతం వీరికి కల్పవృక్షంలో మారింది .కనీసంగా అచ్చు కూడా వేయని ఆ పత్రికకు అక్షరాల రూ. 2. 11 లక్షల రూపాయలు ఇచ్చారంటే ఎవరి సొమ్ము ఎవరికిస్తున్నా రో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. దీనిపై పట్టణ ప్రజలు తిరగబడి తరమాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు భావిస్తున్నారు. ఇలాంటి అవినీతి భాగోతాలకు జడ్చర్ల మున్సిపాలిటీ వేదిక కావడం దురదృష్టకరం. దీనికి పాలకమండలి చైర్మన్, కమిషనర్ ప్రజలకు జవాబు చెప్పా లి. మున్సిపల్ పాలకమండలి ఏర్పడినప్పటి నుండి ప్రభుత్వం నుండి ప్రజల నుండి వచ్చిన డబ్బులకు చేసిన పనులకు లెక్కలు చెప్పి ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.
