సెలవు దినంలో ప్రభుత్వ కార్యాలయంలో తలుపులు వేసుకొని విధులు నిర్వహించవలసిన అవసరం ఏంటి...?

 అక్రమాలు సక్రమాల కోసమే ఆదివారం ఆఫీసులో ఉన్నారా..?



ఆదివారం రోజు ప్రభుత్వ కార్యాలయం మూసుకొని లోపల ఒక ప్రైవేటు వ్యక్తిని కూర్చోబెట్టి బాలనగర్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏమి చేస్తున్నారు అంటూ జడ్చర్ల శాసనసభ్యులు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎమ్మార్వో కార్యాలయంలో అక్రమాల గురించి గత కొంతకాలంగా జడ్చర్ల శాసనసభ్యుడు పోరాడుతున్న సంగతి అందరికీ తెలిసిందే ఇక్కడ ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తుల స్థలాల పేర్లు రాత్రికి రాత్రి మారిపోవడం కలెక్టర్ దాకా ఫిర్యాదులుకోవడం గతంలో మనం చూసింది. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేగా అందరిని గెలిచాక ప్రభుత్వ కార్యాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు ఎక్కడ ఏ తప్పు జరగకూడదు పేదవాడికి ఇబ్బంది జరుగుద్దనే ఉద్దేశంతో తను ప్రజల పక్షాన ఉన్నట్లు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు. 

ప్రభుత్వ కార్యాలయంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను అరికట్టాలను ఉద్దేశంతో విషయం తెలుసుకున్న వెంటనే ఆకస్మికంగా బాలనగర్ తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రెవెన్యూ ఇన్స్పెక్టర్ మధ్యత దళారి వ్యక్తిని మాజీ రిటైర్డ్ అధికారిని పట్టుకొని,  మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్లకు ఫోన్ చేసి సంబంధిత అధికారులు సస్పెండ్ చేయాల్సిందిగా కోరారు.  లేనిపక్షంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడానికి కూడా వెనకాడనని తెలిపారు. ఇలాంటి సంఘటనలు ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కలెక్టర్కు తెలిపారు.  అలాగే సంబంధిత అధికారిపై తగు విచారణ జరిపించి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. 

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow