జడ్చర్ల: “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే నానుడిని ఆచరణలో పెట్టినట్లు జడ్చర్లలో నిర్వహించిన ‘పాలమూరు రన్’ కార్యక్రమం ఘన విజయాన్ని సాధించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న మారథాన్‌లలో భాగంగా ఆదివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి 8 గంటల వరకు ఈ రన్ ఉత్సాహంగా సాగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా 2 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల విభాగాల్లో వందలాది మంది పాల్గొన్నారు. ముఖ్యంగా స్కూల్ విద్యార్థినులు చీరలు కట్టుకుని ఉత్సాహంగా రన్నింగ్‌లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది.
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధి మాత్రమే కాకుండా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఆరోగ్య ప్రేమికులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. యువత, మహిళలు, వృద్ధులు కూడా సమానంగా పాల్గొనడం విశేషం.
కార్యక్రమం అనంతరం విజేతలకు బహుమతులు అందజేసి, ఈ రన్ విజయవంతం కావడానికి సహకరించిన దాతలు, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, జూన్ 7న హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించనున్న మారథాన్‌లో జడ్చర్ల నుంచి మరింత మంది పాల్గొనాలని పిలుపునిచ్చారు.