Hyderabad:
MLA Rajasingh Arrest: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెదక్‌లో అల్లర్లు జరిగిన నేపథ్యంలో.. పరిస్థితి అదుపుతప్పకుండా ఉండేందుకు రాజాసింగ్‌ను ముందస్తుగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, వైద్యపరీక్ష నిమిత్తం మియాపూర్‌లో ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఇదిలాఉంటే.. మెదక్‌లో ఘర్షణల నేపథ్యంలో....
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెదక్‌లో అల్లర్లు జరిగిన నేపథ్యంలో.. పరిస్థితి అదుపుతప్పకుండా ఉండేందుకు రాజాసింగ్‌ను ముందస్తుగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, వైద్యపరీక్ష నిమిత్తం మియాపూర్‌లో ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఇదిలాఉంటే.. మెదక్‌లో ఘర్షణల నేపథ్యంలో తాను అక్కడికి వెళ్తానని రాజాసింగ్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ముంబైలో ఉన్న ఆయన ఇవాళ హైదరాబాద్‌కు వచ్చారు. రాజాసింగ్ కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పోలీసులు.. ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాగానే అదుపులోకి తీసుకున్నారు.
