భారీగా పెరిగిన బిజెపి ఓటు బ్యాంక్ పనిచేసిన మోడీ స్టామినా బిజెపి నాయకులలో పెరిగిన ఆత్మవిశ్వాసం

 అనూహ్యంగా పుంజుకున్న బిజెపి

 


భారీగా పెరిగిన 

బిజెపి ఓటు బ్యాంక్

 

పనిచేసిన మోడీ స్టామినా 


బిజెపి నాయకులలో పెరిగిన ఆత్మవిశ్వాసం 




 నవాబుపేట మండలంలో భారతీయ జనతా పార్టీ లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్నది. ఆ పార్టీకి సరైన క్యాడర్ లేకున్నా మోడీ ప్రభంజనం ఆ పార్టీని మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లోకి చేర్చింది. ఇప్పటివరకు మండలంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి అపసోపాలు పడింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు తన ఉనికి చాటుకోవడానికి ఎంతో శ్రమించిన బిజెపి కేవలం మండల కేంద్రంలో మాత్రమే రెండు వందల ఓట్లు సాధించి దాంతోనే సంతృప్తి చెందింది. అలాంటి బిజెపి లోక్ సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి దీటుగా ఓట్లు సాధించి తన ప్రాబల్యాన్ని చాటుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మండలంలో కాంగ్రెస్ పార్టీకి 16,898 ఓట్లు, బిఆర్ఎస్ పార్టీకి 13,344 ఓట్లు పోలవ్వగా ఈ ఎన్నికలలో అనూహ్యంగా బిజెపికి 13,423 ఓట్లు,కాంగ్రెస్ పార్టీకి 12,182 ఓట్లు,బిఆర్ఎస్ పార్టీకి 6,317 ఓట్లు పోలయ్యాయి.

14 గ్రామాలలో కాంగ్రెస్, 13 గ్రామాలలో బిజెపి మెజారిటీ సాధించగా, బిఆర్ఎస్ కేవలం రెండు గ్రామాలలో మాత్రమే ఆధిక్యతను ప్రదర్శించింది. బిజెపి ప్రభంజనంలో సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డికి 

సొంత మండలంలో 

కూడా  

ఆదరణ లభించలేదు.

 ఈ ఎన్నికలలో బిజెపికి భారీగా ఓటు బ్యాంకు పెరిగింది.భారీగా పెరిగిన బిజెపి ఓటు బ్యాంకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపుకు ఎంతో దోహదపడే మాదిరిగా ఉంది. ఈ ఎన్నికల్లో గెలుపు ద్వారా మండల బిజెపి నాయకుల్లో ఆత్మవిశ్వాసం ఎంతో పెంపొందింది. అందువల్లనే బిజెపి అభ్యర్థి డికె అరుణ ఎన్నికల్లో గెలిచినందుకు ఆ పార్టీ నాయకులు మండలంలోని గ్రామ గ్రామాన బాణాసంచా పేల్చి,స్వీట్లు పంచి ఘనంగా విజయోత్సవ సంబరాలు అంబరాన్నంటే విధంగా నిర్వహించారు. మండలంలో గల అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల నాయకులు తమ పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం అవసరమైనంత మేరకు కృషి చేయకపోవడం బిజెపికి బాగా అనుకూలించింది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్థానికంగా తగిన ఆదరణ లభించకపోవడంతో వారు ఇక్కడ పార్టీ ప్రచారాన్ని గాలికి వదిలేసి నాగర్ కర్నూల్ పార్లమెంట్ లోక్ సభ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి ప్రచారంలో ముమ్మరంగా పాల్గొనడం అక్కడ ఆయన గెలుపుకు తోడ్పడగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ చల్లా వంశీచందర్ రెడ్డి ఓటమికి కారణమైంది. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి స్వయంకృతాపరాధం కారణంగానే ఓటమిని చవిచూశారు. ఎంపీగా ఆయన సొంత మండలంలోని గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు చేసిన కృషి బూడిదలో పోసిన పన్నీ రుగా మారింది. పోలింగ్ తేదీ వరకు ఆ పార్టీ నాయకులు మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి వారిని తమ ఓటు బ్యాంకుగా మలుచుకున్న సమయంలో ఆ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి పార్టీ నాయకులకు చేయి ఇవ్వడం వల్లనే ఆ పార్టీ ఓటు బ్యాంక్ ను భారీగా కోల్పోయిందని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా బహిర్గతం చేశారు. ఆ రెండు పార్టీల నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం బిజెపికి బాగా అనుకూలించింది. అందువల్లే ఆ పార్టీ నాయకులు మండలంలో ఈ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుని కాంగ్రెస్, బి ఆర్ఎస్ పార్టీల నాయకులను కోలుకోకుండా చేశారు. ఎన్నికల్లో బలోపేతంగా మారిన బిజెపి స్థానిక సంస్థల ఎన్నికలకు బలమైన పునాదిని వేసుకున్నది. ఆ పార్టీ నాయకులు లోక్ సభ ఎన్నికల్లో మాదిరిగానే భవిష్యత్తులో కూడా పట్టు విడవకుండా కృషి చేస్తే ప్రస్తుత పరిస్థితులలో మండలం కమలమయమైనా కూడా ఆశ్చర్య పడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడిప్పుడే పార్టీ క్యాడర్ పెంపు కోసం 

 కృషి చేస్తున్న నాయకులు పట్టు విడవని విక్రమార్కుల్లా కృషి చేస్తే మండలం కాషాయమయం కావడం ఎంతో సులువని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి 

చూసి జవసత్వాలు కోల్పోయిన బిఆర్ఎస్ పార్టీని వీడి తమ రాజకీయ భవిష్యత్తుకు మార్గదర్శకులైన యువతతో మమేకమై వారికి అండగా ఉంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలని అనేకమంది ఆ పార్టీ నాయకులు ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ప్రకారం యువత మొత్తం బిజెపికి అనుకూలంగా ఉండడం వల్ల వారిని తమ పార్టీలోకి ఆహ్వానించే కంటే వారి ఆదరణ ఉన్న పార్టీలోకి చేరితేనె తమకు మనుగడ ఉంటుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అందుకోసం గ్రామాలలో ని తమ అనుచరులతో, కార్యకర్తలతో ఆ పార్టీ నాయకులు బిజెపిలో చేరే విషయమై సమాలోచనలు చేస్తున్నారు.మండలంలో బిజెపి ఎదుగుదలను అధికార,ప్రధాన ప్రతిపక్ష పార్టీల నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో ఇప్పటివరకు ద్విముఖ పోటీ మాత్రమే జరుగుతుండేది. లోక్ సభ ఎన్నికల్లో బిజెపి బలపడడం ద్వారా భవిష్యత్తులో త్రిముఖ పోటీ అనివార్యం కానుండడంతో కాంగ్రెస్,

 బిఆర్ఎస్ పార్టీల నాయకులకు అది మింగుడు పడడం లేదు. ఇప్పటి వరకు జరిగిన శాసనసభ, లోక్ సభ, శాసనమండలి ఎన్నికల్లో దెబ్బ మీద దెబ్బ తిన్న ఆయా పార్టీల నాయకులు,కార్యకర్తలు బిజెపి ప్రభంజనాన్ని స్థానిక సంస్థల ఎన్నికలలో ఎలా ఎదుర్కోవాలనే విషయం గురించి తర్జన, భర్జనలు పడుతున్నారు. ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బిజెపికి మరింత అనుకూలించే అవకాశం లేకపోలేదు. అయితే ప్రభుత్వం ఎప్పుడు 

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణకు శ్రీకారం చుడుతుందో

 వేచి చూడాల్సిందే.

Previous Post Next Post

Education

  1. TG DOST తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు - 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల...! - New!
  2. TGSRJC : టెన్త్ విద్యార్థులకు అప్డేట్ - టీజీఆర్‌జేసీ సెట్‌ 2025 హాల్‌టికెట్లు విడుదల, ఈ లింక్ తో డౌన్లోడ్ చేసుకోండి - New!

نموذج الاتصال