Hyderabad: ఆరు నెలల్లో అంతా తారుమారు అయ్యిందిగా..


 

లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha elections) ముగిశాయి. గెలిచిన వారు సంబరాలు చేసుకుంటున్నారు. ఓడిపోయిన అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. ఆరు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లకంటే పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీలకు పోలైన ఓట్లు మూడు రెట్లు పెరిగాయి.


అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పార్టీవైపు.. పార్లమెంట్‌ ఎన్నికల్లో మరో పార్టీ వైపు ప్రజల మొగ్గు

- బీజేపీకి నాడు మూడో స్థానం.. నేడు 50 వేల ఓట్ల మెజారిటీ

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha elections) ముగిశాయి. గెలిచిన వారు సంబరాలు చేసుకుంటున్నారు. ఓడిపోయిన అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. ఆరు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లకంటే పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీలకు పోలైన ఓట్లు మూడు రెట్లు పెరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి 49 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్‌కు 47 వేల ఓట్లు పోలవగా, కాంగ్రెస్‌ అభ్యర్థి మందముల పరమేశ్వర్‌రెడ్డికి 83 వేల ఓట్లు పోలయ్యాయి.


లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌(Etala Rajender)కు ఉప్పల్‌ నియోజకవర్గంలో 50 వేల ఓట్ల ఆధిక్యం లభించింది. కాంగ్రెస్‌ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే ఎనిమిదివేల ఓట్లు తగ్గాయి. బీఆర్‌ఎస్‏కు 48వేల ఓట్లు పోలయ్యాయి. ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాజకీయ పార్టీల బలాబలాలు ఒక్కసారిగా మారడంతో నాయకులు ఆందోళన చెందుతున్నారు. డివిజన్ల వారీగా పార్టీలకు పోలైన ఓట్ల సంఖ్యను లెక్కలు వేసుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ ఓట్లు బీజేపీకి పడడంపట్ల కిందిస్థాయి క్యాడర్‌ అసంతృప్తి వ్యక్త చేస్తోంది.


ఉప్పల్‌ నియోజకవర్గంలో పార్టీల వారీగా పోలైన ఓట్లు

అసెంబ్లీ పార్లమెంట్‌

బీఆర్‌ఎస్‌ 1,39,297 48,954

కాంగ్రెస్‌ 83,897 76,870

బీజేపీ 47,332 1,30,105

Previous Post Next Post

نموذج الاتصال