మంత్రాల నెపంతో గొడ్డలితో మహిళపై దాడి.

 జనగామ: 



ఓ మహిళపై మంత్రాల నెపంతో గొడ్డలితో దాడి చేసిన ఘటన జనగామ జిల్లా నర్మెట్ట మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నక్కల రవి, తండ్రి పోచయ్య కుటుంబ సభ్యులు కొద్ది రోజులుగా అనారోగ్య పాలవుతున్నారు. ఈ క్రమంలో స్థానికురాలైన సత్తమ్మ మంత్రాలు చేస్తుందని అనుమానంతో సత్తెమ్మపై రవి గొడ్డలితో దాడి చేశాడు. ప్రస్తుతం ఆమె వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతుంది.

Previous Post Next Post

نموذج الاتصال