గొర్రెల స్కీంలో భారీ స్కాం.. రూ.700కోట్లు

Sheep scheme Scam: గొర్రెల స్కీంలో భారీ స్కాం.. రూ.700కోట్లు ప్రైవేట్‌ వ్యక్తుల ఖాతాల్లోకి మళ్లింపు..!

వేలు కాదు లక్షలు కాదు.. అక్షరాల 7వందల కోట్లు మింగేశారు. గొర్రెల పంపిణీ స్కీంను పెద్ద స్కాంగా మార్చేశారు. రైతులకు బదులు ప్రైవేట్ వ్యక్తుల అకౌంట్లలోకి నిధులు మళ్లించారు. ఈ కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ.. త్వరలోనే అసలు సూత్రధారులను అరెస్ట్ చేసేందుకు రెడీ అవుతోంది.

తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ కేసులో దూకుడు పెంచిన ఏసీబీ..తాజాగా ఇద్దరు కీలక అధికారులను గొర్రెల స్కామ్‌లో అరెస్ట్ చేసింది. అక్షరాల 700 కోట్ల అవినీతి జరిగినట్టు తేల్చింది. రంగారెడ్డి జిల్లాలో జరిగిన స్కామ్‌ని వెలికితీయగా భారీ అవినీతి బయటపడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నలుగురు ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు..వారి నుంచి సమాచారం సేకరించి.. తాజాగా మరో ఇద్దరు కీలక అధికారులను పట్టుకుంది. తెలంగాణ పశుసంవర్థకశాఖ మాజీ ఎండీ రామ్‌చందర్‌తో పాటు మాజీ ఓఎస్‌డీ కల్యాణ్‌ను అరెస్ట్ చేసింది. కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.

గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారు అధికారులు. 700కోట్ల రూపాయలను రైతులకు బదులు ప్రైవేట్‌ వ్యక్తుల ఖాతాల్లోకి మళ్లించారని ఏసీబీ అధికారులు గుర్తించారు. వందల కోట్ల రూపాయలు బ్రోకర్స్‌, అధికారులే మింగేశారని అనుమానిస్తోంది ఏసీబీ. ఈ స్కామ్‌లో కింది స్థాయి నుంచి పైస్థాయి అధికారుల పాత్రపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తోంది. గొర్రెల స్కాంలో ఇప్పటివరకు దాదాపు పదిమందిని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. త్వరలో కీలక వ్యక్తులను అరెస్ట్ చేసేందుకు ఏసీబీ రెడీ అవుతోందని టాక్ నడుస్తోంది.

Previous Post Next Post

نموذج الاتصال