MLC Kavitha: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ #viral @news #news



 ఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ క్రమంలోనే నేడు కవితను అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ నేటితో రిమాండ్ ముగుస్తోంది. నిజానికి కవిత బెయిల్ కోసం ఆమె తరుఫు న్యాయవాదులు చాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికి పలుమార్లు ఆమెకు బెయిల్ రిజెక్ట్ అయ్యింది. ఈసారి మరి న్యాయస్థానం కవితకు రిమాండ్ పొడిగిస్తుందా? లేదంటే బెయిల్ ఇస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. 



ఈడీ దాఖలు చేసిన చార్జిషీటును నేడు న్యాయస్థానం పరిగణలోకి తీసుకోనుంది. అనంతరం కవితకు, ఇతర నిందితులకు చార్జిషీట్ కాపీ అందించే అవకాశం ఉంది. సీబీఐ, ఈడీ రెండు కేసుల్లో మరో 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించే అవకాశమే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈసారి కవితను కోర్టుకు నేరుగా తీసుకు రాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను హాజరుపరిచే అవకాశం ఉంది.

Previous Post Next Post

Education

  1. TG EAPCET Results 2025 : నేడు తెలంగాణ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు విడుదల.... మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి - New!
  2. TG EAPCET Results 2025 : మే 11న టీజీ ఈఏపీసెట్‌ 2025 ఫలితాలు విడుదల - ర్యాంక్ ఎలా చెక్ చేసుకోవాలంటే...? - New!

نموذج الاتصال