భూవివాదంలో లంచం.. పోలీసులను పట్టుకున్న ఏసీబీ



TG News: భూవివాదంలో లంచం.. పోలీసులను పట్టుకున్న ఏసీబీ

ఏసీబీ అధికారులు పట్టుకున్న వారిలో జడ్చర్లలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన వీరస్వామి కూడా ఉండడం విశేషం. 

జడ్చర్లలో పనిచేస్తున్నప్పుడు కూడా సీఐ వీరేశ్ స్వామి మీద పలు ఆరోపణలు.

ఏసీబీ అధికారులు విస్తృత దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో భయం పుట్టిస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.



హైదరాబాద్: ఏసీబీ అధికారులు విస్తృత దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో భయం పుట్టిస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ భూ వివాదం కేసులో రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా.. ఇన్‌స్పెక్టర్ వీరస్వామి, ఎస్సై షఫీ, మధ్యవర్తి ఉపేందర్‌లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.



ఓ భూ వివాదానికి సంబంధించి పరిష్కారం కోసం మధ్యవర్తి ద్వారా లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లోనూ సోదాలు చేశారు. లంచం తీసుకుంటుండగా పోలీసులతో పాటు మధ్యవర్తిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గతంలో వీరిపై ఉన్న ఆరోపణలపైనా దృష్టి సారించారు. అటు, గుర్రంగూడ సమీపంలోని ఇన్‌స్పెక్టర్ వీరస్వామి నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి.

Previous Post Next Post

نموذج الاتصال