Viral Photo: అభిమాని పెళ్ళిలో సందడిచేసిన స్టార్.. మరీ ఇంత సింపుల్గానా!

Caption of Image.

మాములుగా స్టార్ అంటే ఫ్యాన్స్ రెచ్చిపోవడం కామనే. వాళ్ళ సినిమాలు రిలీజ్ అయ్యాయంటే థియేటర్స్ దగ్గర రచ్చ రచ్చ చేస్తుంటారు. అంతేకాదు.. వాళ్ళ ఇంట్లోవాళ్ల కన్నా ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే.. కొంతమంది స్టార్స్ వాళ్ళ ఫ్యాన్స్ ని కూడా అదే రేంజ్ లో ట్రీట్ చేస్తూ ఉంటారు. వాళ్లకి ఎలాంటి అవసరం వచ్చినా ముందు ఉంటారు. తాజాగా ఆలాంటి పనే ఒకటి చేశారు తమిళ స్టార్ విజయ్ సేతుపతి.

రీసెంట్ గా ఆయన తన అభిమాని పెళ్లికి హాజరయ్యాడు. మదురై జిల్లా ఉసిలంబట్టి పరిధి కీజాపుదూర్‌కు చెందిన జయబాస్,జయపాల్ ఇద్దరూ విజయ్‌ సేతుపతికి  వీరాభిమానులు. అందులో ఒకరు విజయ్ సేతుపతి జిల్లా అభిమాని సంఘానికి అధ్యక్షుడిగా కాగా.. మరోకరు జిల్లా ఉప కార్యదర్శిగా ఉన్నారు. ఈ ఇద్దరు తాము ఇష్టపడ్డ అమ్మాయిలను జూన్ 2న పెళ్లిచేసుకోబోతున్నారు.

అయితే.. విజయ్‌ సేతుపతికి 2వ తేదీలో షూటింగ్‌ ఉండటంతో ముందుగానే వధూవరులను ఆశీర్వదించేందుకు వారి ఇంటికి వెళ్లారు. దాంతో ఆ ప్రాంతం అంతా సందడిగా మారింది. విజయ్ సేతుపతిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ విజయ్ సేతుపతిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు చాలా గ్రేట్ అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.


from V6 Velugu https://ift.tt/s8rdmV0
via IFTTT
Previous Post Next Post

نموذج الاتصال