*జడ్చర్ల మున్సిపాలిటీలో చెరువు కట్టకు అనుకొని ఇంటి నిర్మాణం*
*నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నిర్మాణం*
అధికారులను ప్రసన్నం చేసుకునే ఐడియా ఉంటే చాలు ఇట్టే ఎలా అయినా పర్మిషన్ లేకుండా నిర్మాణం చేసుకోవచ్చు.
జడ్చర్లలో రోజురోజుకి పెరిగిపోతున్న ఆక్రమణలు..
గుడివదులరు బడి వదలరు చెరువు కట్ట కి వెళ్లే దారి కూడా వదలరు.
కొందరి అండదండలతోనే ధైర్యంగా నిర్మిస్తున్నట్లు పాత బజారు వాసులు గుసగుసలాడుకుంటున్నారు.
జడ్చర్ల పురపాలిక పరిధిలోని శివాలయం టెంపుల్ పక్కన ఉన్న చెరువు కట్టకు ఆనుకొని ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. చెరువుగట్టుకు ఆనుకొని పురపాలిక అధికారులు ఇంటి నిర్మాణానికి ఏ విధంగా అనుమతులు ఇచ్చారని స్థానికులు చర్చించుకుంటున్నారు. సదరు వ్యక్తి రోడ్డును ఆక్రమించి ఇంటి నిర్మాణానికి పునాదులు వేసిన సంఘటన ఇటీవల చోటు చేసుకుంది