మహబూబ్ నగర్ పట్టణంలో పెట్రోల్ పంపుల పై లీగల్ మెట్రాలజీ శాఖ తనిఖీలు



మహబూబ్నగర్: పెట్రోల్ బంక్ ల పై అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో లీగల్ మెట్రాలజీ శాఖ జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి పి రామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం పలు పెట్రోల్ పంపు లపై తనిఖీలు నిర్వహించారు అందులో ముఖ్యంగా హైటెక్  ఫిల్లింగ్,స్టేషన్, కైలాష్ ఆటో సప్లైస్, రామేశ్వర ఫిల్లింగ్ స్టేషన్, ఆర్ఎస్ రాటీ ఫిల్లింగ్ స్టేషన్ లపై తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలలో ఎటువంటి ఉల్లంఘనలు బయల్పడలేదు. ఈ సందర్భంగా పెట్రోల్ పంపు వారు ప్రతి రోజు తమ యొక్క పెట్రోల్ పంపులు సరిగా పనిచేస్తున్నాయా లేదా అనే విషయాన్ని పెట్రోల్/డీజిల్ డెలివరీ ద్వారా నిర్ధారించుకోన్న తర్వాతే వారి యొక్క పంపులను వాడాలి. వారి పంపులకి ప్రతి సంవత్సరం విధిగా వెరిఫికేషన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. వెరిఫికేషన్ సర్టిఫికెట్  కాల పరిమితి ముగిసిన తర్వాత వాడినట్లయితే వారిపై కేసు నమోదు అవుతుంది కావున పెట్రోల్ పంపు వారు తప్పనిసరిగా వెరిఫికేషన్ చేయించుకుని సర్టిఫికెట్ తీసుకున్నకే వాడాల్సి ఉంటుంది. వినియోగదారులు కోరినట్లయితే ఐదు లీటర్ల క్యాన్ తో డెలివరీ లను చెక్ చేసి చూపించాలి అని జిల్లా లీగల్ మెట్రాలజి,అధికారి పి రామకృష్ణ పేర్కొన్నారు. పైనిబంధనలుఉల్లంఘించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగు తుందనిఅనిహెచ్చరించారు. ఈ సందర్భంగా వినియోగదారులు వారికి ఎటువంటి కంప్లైంట్ ఉన్న లీగల్ మెట్రాలజిశాఖ కార్యాలయం ను సంప్రదించవచ్చని లేదా వాట్సాప్ ద్వారా ఫోన్ నెంబర్ 9010651783 కు కంప్లైంట్ నమోదుచేసుకోవచ్చని ఆయన తెలిపారు.






Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow