PBKS vs SRH: మా జట్టు సూపర్ స్టార్: తెలుగు కుర్రాడిపై సన్ రైజర్స్ కెప్టెన్ ప్రశంసలు

Caption of Image.

ఐపీఎల్ లో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి సత్తా చూపిస్తున్నాడు. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్నాడు. మయాంక్ అగర్వాల్ గాయపడడంతో చివరి రెండు మ్యాచ్ ల్లో ఈ తెలుగు కుర్రాడికి తుది జట్టులో స్థానం దక్కింది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సిక్స్ తో మ్యాచ్ ముగించగా.. ఈ మ్యాచ్ లో తనను తాను నిరూపించుకోవడానికి పెద్దగా అవకాశం రాలేదు. అయితే నిన్న (ఏప్రిల్ 9) చంఢీగర్ లో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో టాప్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు.

39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును ఆదుకున్నాడు. ఎంతో పరిణితి ఆటగాడిలా ఆడుతూ జట్టుకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. 20 ఏళ్ల నితీశ్‌ రెడ్డి 37 బంతుల్లో 64 పరుగులతో (4ఫోర్లు, 5 సిక్స‌ర్లు) అద్భుతంగా రాణించడంతో పాటు బంతితో కూడా ఆక‌ట్టుకున్నాడు.  చివర్లో జితేష్ శర్మ వికెట్ లాంటి కీలక వికెట్ తీసుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లతో ఆకట్టుకొని సన్ రైజర్స్ కు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. ఈ తెలుగు కుర్రాడి ఆటకు సన్ రైజర్స్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్  ఫిదా అయ్యాడు. 

నితీశ్ రెడ్డి  సన్ రైజర్స్ జట్టుకు సూపర్ స్టార్ అని కొనియాడాడు. అతను ఓ అద్భుతమైన ఆటగాడని.. అతని ఇన్నింగ్స్ కారణంగా మేము 180 పరుగుల మార్క్ ను అందుకున్నాం అని కమ్మిన్స్ తెలిపాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్‌తో గెలుపులో కీలక పాత్ర పోషించాడని మ్యాచ్ అనంతరం ఈ  ఆసీస్ సారధి అన్నాడు. చివరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ పై సన్ రైజర్స్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

©️ VIL Media Pvt Ltd.


from V6 Velugu https://ift.tt/XZrBv4e
via IFTTT
Previous Post Next Post

نموذج الاتصال