*
మహబూబ్ నగర్ కు చెందిన పురం శ్రీనివాసులు (85) తన మరణాంతరం నేత్ర దానం చేసి ఆదర్శంగా నిలిచారు. తన నేత్రాలను దానం చేసి మరో ఇద్దరికి చూపును ప్రసాదించి స్ఫూర్తిగా నిలిచారు. అనారోగ్య కారణాలతో మహబూబ్ నగర్ తన నివాస గృహంలో కన్ను మూసిన శ్రీనివాసులు కోరిక మేరకు ఆయన కుటుంబ సభ్యులు సూర్య కళ , శివకుమార్, రవి కుమార్, రాజేంద్ర కుమార్ , ప్రవీణ్ కుమార్ లు ఈ విషయంగా రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజు ను సంప్రదించారు. ఈ మేరకు నట రాజు ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి కి చెందిన టెక్నీషియన్ శివ కు సమాచారం అందించారు. సత్వరమే స్పందించిన శివ పురం శ్రీనివాసులు ఇంటి కి రాత్రి 11.30 గంటలకు చేరుకొని ఆతని నుంచి కార్నియా ను సేకరించారు. అనంతరం శ్రీనివాసులు కుటుంబ సభ్యులకు కార్నియా సేకరించినట్లు టెక్నిషియన్ శివ ధృవ పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా లయన్ నటరాజు మాట్లాడుతూ నేత్ర దానం చేసిన శ్రీనివాసులు కుటుంబ సభ్యులను అభినందించారు. ఇప్పటి వరకు మహబూబ్ నగర్ పట్టణం లో 159 మంది నుంచి కార్నియా ను సేకరించినట్లు తెలిపారు. మరణానంతరం నేత్ర దానం చేస్తే ఇద్దరికి చూపును ఇచ్చిన వారమవుతామని అన్నారు. నేత్ర దానం చేసేందుకు 9666900900కు సంప్రదించాలని కోరారు.



