Lok Sabha Election 2024 LIVE Updates: ప్రారంభమైన తొలిదశ పోలింగ్.. పోలింగ్ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
Lok Sabha Poll 2024 Phase 1 Voting Live News and Updates in Telugu: లోక్‌సభ సమరానికి తెరలేసింది. ఏడు విడతల్లో జరిగే సార్వత్రిక లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ విడతలో 102 లోక్‌సభ నియోజక వర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో మొత్తం 16 కోట్ల 63 లక్షలమంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సుమారు లక్షా 87 వేల పోలింగ్ స్టేషన్లను...
Lok Sabha Election 2024 LIVE Updates: ప్రారంభమైన తొలిదశ పోలింగ్.. పోలింగ్ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
Lok Sabha Election
బరిలోకి దిగిన ప్రముఖులు వీళ్లే..
మొదటి విడత ఎన్నికల బరిలో పలువురు ప్రముఖులు ఉన్నారు. వారిలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి బరిలో ఉన్నారు. మరో ప్రముఖుడు జితిన్ ప్రసాద్ యూపీలోని పిలిభిత్ లోకసభ నియోజక వర్గం నుంచి, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై చెన్నై సౌత్ నుంచి బీజేపీ అభ్యర్థిగా, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం తన తండ్రి ఏడుసార్లు నెగ్గిన శివగంగ లోక్‌సభలో పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ తమిళనాడు అధ్యక్షుడైన అన్నామలై కోయంబత్తూరు నుంచి పోటీలో ఉన్నారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో తొమ్మిది మంది కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఒక మాజీ గవర్నర్ బరిలో ఉన్నారు.
ఈ ప్రాంతాల్లో భద్రత పెంపు..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న బస్తర్ లోక్‌సభ నియోజకవర్గంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ నేడు పోలింగ్ జరుగుతోంది. ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునివ్వడంతో భద్రతా దళాలకు ఎన్నికల నిర్వహణ సవాలుగా మారింది.
ఏయే రాష్ట్రాల్లో తొలి దశ పోలింగ్ జరగనుందంటే..
మొదటి విడతలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్ఛిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులతో సహా కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరి లలో ఎన్నికలు జరుగతున్నాయి.
Lok Sabha Poll 2024 Phase 1 Voting Live News and Updates in Telugu: లోక్‌సభ సమరానికి తెరలేసింది. ఏడు విడతల్లో జరిగే సార్వత్రిక లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ విడతలో 102 లోక్‌సభ నియోజక వర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో మొత్తం 16 కోట్ల 63 లక్షలమంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సుమారు లక్షా 87 వేల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 18 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. 21 రాష్ట్రాల్లోని పార్లమెంటు స్థానాలతో పాటు అరుణాచల్, సిక్కిం రాష్ర్టాల అసెంబ్లీలకు కూడా నేడు ఎన్నికలు జరగుతున్నాయి.
మొదటి దశలో మిగతా దశల కన్నా ఎక్కువ స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండటం అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు ప్రధానంగా మారాయి. మొదటి విడతలో ఆధిక్యం చూపితే అది మిగతా దశల్లో కూడా ఆ ఆధిక్యం కొనసాగుతుందని పార్టీలు ఆశిస్తున్నాయి. మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి బీజేపీ, దాని మిత్రపక్షాలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇంతవరకు సొంతంగా విజయం రుచి చూడని తమిళనాడులో, తొలిసారిగా కేరళలో విజయం సాధించాలని కమలం పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. ఇతర పార్టీలు సైతం ఎన్నికల్లో గెలుపుపై గట్టి ఆశలే పెట్టుకున్నాయి.