డిటర్జెంట్ పౌడర్ ముసుగులో స్మగ్లింగ్

 

yderabad: డిటర్జెంట్ పౌడర్ ముసుగులో స్మగ్లింగ్ గ్యాంగ్ ఏం చేసిందో తెలిస్తే..


రాజేంద్రనగర్ ఎస్ఓటీ అధికారులు నకిలీ సిగరెట్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టును రట్టు చేశారు. డిటర్జెంట్ పౌడర్ ముసుగులో నకిలీ సిగరెట్స్ స్మగ్లింగ్‌కు కేటుగాళ్లు తెర లేపారు. గగన్ పహాడ్ వద్ద ఓ పార్కింగ్‌లో 2 కోట్ల విలువ చేసే వివిధ బ్రాండ్స్‌కు చెందిన సిగరెట్లను గుర్తించారు.





హైదరాబాద్: రాజేంద్రనగర్ ఎస్ఓటీ అధికారులు నకిలీ సిగరెట్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టును రట్టు చేశారు. డిటర్జెంట్ పౌడర్ ముసుగులో నకిలీ సిగరెట్స్ స్మగ్లింగ్‌కు కేటుగాళ్లు తెర లేపారు. గగన్ పహాడ్ వద్ద ఓ పార్కింగ్‌లో 2 కోట్ల విలువ చేసే వివిధ బ్రాండ్స్‌కు చెందిన సిగరెట్లను గుర్తించారు. బీహార్ రాష్ట్రం నుంచి పాట్నా మీదుగా హైదరాబాద్‌కు ఓ భారీ కంటైనర్‌లో సిగరెట్లను ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ (Hyderabad) ముషీరాబాద్‌లోని శ్రీరామ ఎంటర్‌ప్రైజెస్ పేరు మీద డెలివరీ అడ్రస్ ఉంది. శ్రీరామ్ ఎంటర్‌ప్రైజెస్ చిరునామా ఆధారంగా పూర్తి వివరాలు స్వేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.
బీహార్‌కు చెందిన‌ నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ‌మరొకరు పరారీలో ఉన్నారు. సిగరెట్లు స్మగ్లింగ్ చేస్తున్న కంటైనర్‌కు కేటుగాళ్లు జీపీఆర్ఎస్‌ను ఫిక్స్ చేశారు. ఈ విషయం యజమానికి తప్ప.. మరెవ్వరికీ తెలియదు. ఎంత కాలం నుంచి ఈ దందా కొనసాగుతుందనే విషయాన్ని కూపి లాగుతున్నారు. ఎస్ఓటీ అధికారులు నకిలీ వస్తువులు తయారు చేస్తున్న కేటుగాళ్ల భరతం పట్టనున్నారు. శ్రీ రామ ఎంటర్‌ప్రైజెస్ యజమాని వివరాలను ఎస్ఓటీ అధికారులు సేకరిస్తున్నారు. ఈ నకిలీ సిగరెట్లు ఏ ఏ రాష్ట్రాలకు తరలించారనే పూర్తి సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال