మీడియాతో చిట్ చాట్‌లో సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి మధ్య ఒకే పోలికలు ఉన్నాయి.
కాంగ్రెస్‌లో 3 గ్రూపులు ఉన్నాయి.. ఎల్లో కాంగ్రెస్, గ్రీన్ కాంగ్రెస్ మరియు గాంధీ కాంగ్రెస్.
కాంగ్రెస్‌లో సీఎం పదవి కోసం పది మంది పోటీ పడుతున్నారు.. ఐదుగురు షిండేలు ఉన్నారు.
కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాడు.
అందుకే రేవంత్ రెడ్డి తన దుకాణం కోసం తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కాకుండా 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సంపాదించుకోవాలని చూస్తున్నాడు.
బి టాక్స్ అంటే భట్టి ట్యాక్స్ అని కాంగ్రెస్ వాళ్లే లీక్ చేశారు.. కాంగ్రెస్‌లో భట్టిపై కుట్ర జరుగుతోంది.
కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డికి అంత సౌకర్యం లేదు.. అందుకే తన వర్గాన్ని పెంచుకోవాలని చూస్తున్నాడు - మీడియాతో చిట్ చాట్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
ఎన్నికల కోడ్.. ’గృహ జ్యోతి‘ పథకానికి బ్రేక్
తెలంగాణలో ’గృహ జ్యోతి‘ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకానికి ఆదిలోనే బ్రేకులు పడ్డాయి. ఫిబ్రవరి 27న ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. గత నెల జీరో బిల్లులు జారీ చేయగా, ఈ నెల ఇచ్చిన బిల్లులో గత నెల బిల్లు కలిపి విద్యుత్ అధికారులు వేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉండటం వల్ల పథకం అమలు చేయట్లేదని విద్యుత్ అధికారులు వివరణ ఇస్తున్నారు. మరి తెలంగాణ సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.