SRH vs CSK Live Score, ఐపీఎల్ 2024: ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్..
Sunrisers Hyderabad vs Chennai Super Kings, ఐపీఎల్ లైవ్ స్కోర్: హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య IPL 2024లో భాగంగా 18వ మ్యాచ్ జరుగుతోంది. పాట్ కమిన్స్ సేనతో ఢీకొట్టేందుకు రుతురాజ్ గైక్వాడ్ సేన సిద్ధమైంది.
12 ఓవర్లలో చెన్నై
12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. క్రీజులో అజింక్యా రహానే, శివమ్ దూబే ఉన్నారు. వీరిద్దరి మధ్య యాభై భాగస్వామ్యం కొనసాగుతోంది.
10 ఓవర్లో 84 పరుగులు..
చెన్నై 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. క్రీజులో అజింక్యా రహానే, శివమ్ దూబే ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన చెన్నై
చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 26(24) పరుగుల వద్ద షాబాద్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో చెన్నై టీం 2 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది.
50 పరుగులు దాటిన చెన్నై స్కోర్
7వ ఓవర్లో చెన్నై 50 పరుగుల మార్కును దాటింది. మయాంక్ మార్కండే వేసిన ఓవర్ రెండో బంతికి గైక్వాడ్ ఒక్క పరుగుతో జట్టును 50 పరుగులకు చేర్చాడు. ఈ ఓవర్ తర్వాత చెన్నై స్కోరు 54/1గా నిలిచింది.
చెన్నైకి తొలి షాక్ ఇచ్చిన భువీ..
నాలుగో ఓవర్ తొలి బంతికే భువనేశ్వర్ కుమార్ 25 పరుగుల స్కోరు వద్ద చెన్నైకి తొలి దెబ్బ ఇచ్చాడు. ఈ ఓవర్ తొలి బంతికే భువీ బౌలింగ్‌లో రచిన్ రవీంద్ర అద్భుతమైన షాట్ ఆడినా.. ఐడెన్ మార్క్‌రామ్ అంతకు మించిన క్యాచ్ పట్టాడు. దీంతో 12 పరుగుల వద్ద రచిన్ ఔటయ్యాడు.