Shreya Ghoshal: ఇండియాస్ రిచెస్ట్ సింగర్ శ్రేయ.. ఒక్కో పాటకు షాకింగ్ రెమ్యూనరేషన్!

Caption of Image.

భాషతో సంబంధం లేకుండా తన గాత్రంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు ప్రముఖ గాయని శ్రేయ ఘోషల్(Shreya Ghoshal). హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మరాఠి, మలయాళం ఇలా దాదాపు అన్ని భాషల్లో ఆమె పాటలు పాడారు. అవడానికి ఆమె నార్త్ గాయని.. అయినప్పటికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. తెలుగులో దాదాపు అందరి స్టార్ మ్యుజీషియన్స్ దగ్గర పాటలు పాడారు. ప్రస్తుతం ఆమె పేరు ఒక బ్రాండ్. ఆమె గాత్రం నుండి ఒక పాట వస్తుంది అంటే అది ఖచ్చితంగా హిట్ అవుతుంది అనేంతలా తన మార్క్ ను సెట్ చేసుకున్నారు శ్రేయ.

గాయనిగా క్షణం తీరికలకుండా గడుపుతున్న ఆమె.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. దానికి కారణం ఒక్కో పాట కోసం ఆమె తీసుకునే రెమ్యునరేషన్. అవును.. ఒక్కో పాటకి ఏకంగా రూ.25 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటుంన్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి.. ఒక్కో పాటకి రూ.25 లక్షలు అంటే మాములు విషయం కాదు. అంతేకాదు.. ఆమె ఇప్పటివరకు నాలుగు సార్లు ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ పై కూడా వచ్చిన విషయం తెలిసిందే. అలా ఆమె ఇండియాస్ రిచెస్ట్ సింగర్ గా పేరు సంపాదించుకున్నారు.  

©️ VIL Media Pvt Ltd.


from V6 Velugu https://ift.tt/atPDVlJ
via IFTTT
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow