*బీఆర్ఎస్ సరే కాంగ్రెస్ ట్యాపింగ్ సంగతేంటి..?*
*మహబూబ్ నగర్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థిని "డీకే అరుణ" సంచలన వ్యాఖ్యలు*
*జైలుకు పంపుతామన్న నేతలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు*
*తెలంగాణలో బీఆర్ఎస్ ఖతం*
*షాద్ నగర్ బిజెపి సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై నిప్పులు చెరిగిన "అరుణ"*
*మీ బిడ్డనై వస్తున్నాను ఆశీర్వదించి పార్లమెంటుకు పంపండి*
రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీకే అరుణ సంచన వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని కుంట్ల రామిరెడ్డి గార్డెన్ లో స్థానిక బిజెపి నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పాలమూరు పార్లమెంటు బిజెపి అభ్యర్థిని డీకే అరుణ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో 1000 మందికి పైగా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డీకే అరుణ మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఎవరి ఫోన్లు టాపింగ్ అయ్యాయి ఎవరెవరిని ఎంక్వయిరీ చేస్తున్నారు విషయం పక్కన పెడితే ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదా? అని డీకే అరుణ ప్రశ్నించారు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి ప్రస్తుత ప్రభుత్వ పరిస్థితులపై ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆమె అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన నేతలను జైలుకు పంపుతానన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు వారిని పార్టీలో చేర్చుకోవడంలో అర్థం ఏమిటని? ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ముందేసుకుని కూర్చుందని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో ప్రకటించిన 6 గ్యారంటీలు అక్కడ ఇవ్వకుండా కనీసం మంచినీరు కూడా ఇవ్వడం లేదని ఆమె ఆరోపించారు. తెలంగాణలో కూడా 6 గ్యారంటీల మాటను దాటవేస్తున్నారని ఇచ్చిన హామీలు తప్పుతున్నారని డీకే అరుణ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏం చేశారని ప్రశ్నించారు. మహిళలకు 2500 రూపాయలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రైతులకు పదిహెను వేల రూపాయల సాయం, కౌలు రైతులకు 12 వేల సాయం ఎప్పుడు
ఇస్తారని? ఆమె ప్రశ్నించారు. పింఛన్ 4000 రూపాయలు, నిరుద్యోగులకు 4000 భృతి, 500 రూపాయలకు సిలిండర్ ఏమయ్యాయి అని ఆమె ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆనాటి ప్రభుత్వంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు ఎత్తిపోతల పనులకు జీవో ఇప్పించింది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో తానేనని గుర్తు చేశారు. లక్ష్మీదేవి పల్లి వ్యవహారంపై ప్రభుత్వం నోరెందుకు మెదపడం లేదని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో స్టైల్ పడుతున్నారని అన్నారు. లేనివి పోనివి ఉత్త పుకార్లు సోషల్ మీడియాలో సృష్టిస్తున్నారని ఆమె అన్నారు. మీ బిడ్డనై వస్తున్నాను పాలమూరు పార్లమెంటులో తనను ఆశీర్వదించి పార్లమెంటుకు పంపాలని డీకే అరుణ బిజెపి కార్యకర్తలను కోరారు. మరోవైపు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కాబోతుందని బీఆర్ఎస్ ఖేల్ ఖతం అని డీకే అరుణ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆధ్వర్యంలో వందలాదిమంది కార్యకర్తలకు కండువాలు వేశారు. ఈ కార్యక్రమంలో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పాతపల్లి కృష్ణారెడ్డి చంది మహేందర్ రెడ్డి విజయ భాస్కర్ మోహన్ సింగ్ లష్కర్ నాయక్ రిషికేష్ మనోహర్ రెడ్డి ముట్పూర్ మాణిక్య రెడ్డి నరసింహ యాదవ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.. కేపీ
