కాంగ్రెస్ ఎమ్మెల్యేకు అస్వస్థత!! మూడు రోజుల విశ్రాంతి చెప్పిన డాక్టర్లు

 ఫ్లాష్ ఫ్లాష్ 



"ఎమ్మెల్యే శంకర్" కు వడదెబ్బ..! 


 కాంగ్రెస్ ర్యాలీలో వాంతులకు గురైన శంకర్ 


 వడదెబ్బతో అస్వస్థత - మూడు రోజులు పూర్తి విశ్రాంతి 


 అభిమానులు నిరాశ చెందవద్దని ఆసుపత్రి నుంచి "శంకర్" సూచన 


 జన్మదినం సందర్భంగా పేదలకు సహాయ సహకార కార్యక్రమాలు చేపట్టాలని వినతి 


షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" కు వడదెబ్బ తగిలింది. గురువారం షాద్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, ఆయా మండలాల అధ్యక్షులు, జెడ్పిటిసిలు తదితరులతో కలిసి నియోజకవర్గం అంతటా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు 6 మండలాల్లో బైక్ ర్యాలీలు కొనసాగాయి. అయితే ఎండ వేడిమికి వీర్లపల్లి శంకర్ కు వడదెబ్బ తగిలింది. దాదాపు అన్ని మండలాలు పర్యటించిన ఎమ్మెల్యే కొందూర్గు ఉమ్మడి మండలం వెళ్లేసరికి నిరసించి పోయారు. ఎమ్మెల్యే శంకర్ కు వాంతులు, విరేచనాలు కావడంతో వడదెబ్బ గట్టిగా తగిలిందని భావించిన నాయకులు వెంటనే ఇంటికి పంపించారు. మళ్లీ మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎమ్మెల్యే శంకర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రిలో అన్ని పరీక్షలు జరిపించారని స్థానిక నాయకులు మహ్మద్ అలీఖాన్ బాబర్, చెంది తిరుపతి రెడ్డిలు తెలిపారు. కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కొంత విశ్రాంతి సత్వరమే అవసరమని వైద్యులు తెలిపినట్టు వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రేపు ఎమ్మేల్యే శంకర్ జన్మదినం. ఇప్పటికే అభిమానులు రేపు వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే అభిమానులు ఎవరు నిరాశ చెందవద్దని రేపు జన్మదిన వేడుకలు నిరుపేదల సంక్షేమం కోసం అభిమానులు కార్యక్రమాలు చేసుకోవాలని సూచించారు తనకోసం ఎవరు తనకోసం ఆసుపత్రికి రావద్దని తనకు వైద్యులు మూడు రోజులపాటు పూర్తి విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారని, కార్యకర్తలు తన వినతిని మన్నించి నిరుపేదల సహాయం కొసం కార్యక్రమాలు  చేపట్టాలని సూచించారు.. కేపీ

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow