https://www.youtube.com/watch?v=-KKScWMOIwE
మండలం లోని పోచమ్మగడ్డతండ వద్ద ఉన్న బాలానగర్ సాంఘీక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఆధిపత్య పోరు కారణంగా విద్యార్థుల మద్య జరిగిన ఘర్షణలో పదవతరగతి విద్యార్థులను ఇంటర్ విద్యార్థులు చితకబాదిన ఘటన చోటు చేసుకుంది. ఘటనతో గురువారం ఆర్సీఓ ఫ్లోరెన్స్రాణి పాఠశాలను సందర్శించి విద్యార్థుల మద్య రాజికుదిర్చారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. పాఠశాలలో కొంత కాలంగా ఇంటర్ పదవతరగతి విద్యార్థుల మద్య ఆధిపత్యపోరు కొనసాగుతుంది. అందులో భాగంగానే బుధవారం రాత్రి 10గంటల 25 నిమిషాలకు ఇంటర్ విద్యార్థి ఒకరు పదవతరగతి విద్యార్థిని చితకబాదాడు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన మరో ఐదుమంది విద్యార్థులు సైతం గాయాలబారిన పడ్డారు. ఘర్షణ జరుగుతున్న క్రమంలో అక్కడికి ఉపాధ్యాయులు చేరుకుని విద్యార్థులకు నచ్చచెప్పారు. పాఠశాలలలోనే ఉన్న ప్రిన్సిపాల్ శ్రీధర్రావు సైతం బుధవారం రాత్రి విద్యార్థులకు నచ్చచెప్పి సముదాయించారు. ఘటనకు సంబంధించి గురువారం ఉదయం పదవతరగతి విద్యార్థులు ఇంటర్ విద్యార్థుల వద్దకు వెళ్లి ఎందుకు తమను కొట్టారని ప్రశ్నించారు. ఈ క్రమం లో మరోసారి వారిమధ్య తోపులాట చోటు చేసుకుంది. అప్పటికే అక్కడికి చేరుకున్న విద్యార్థిసంఘాలు, కొందరు విద్యార్థుల
ఆర్సీఓ ఫ్లోరెన్స్ణి సైతం పాఠశాలకు చేరుకుని విద్యార్థుల మద్య రాజి కుదిర్చారు. కొట్టిన విద్యార్థులు తమది తప్పయ్యిందని పదవ తరగతి విద్యార్థులక క్షమాపణలు చెప్పి కలిసిపోయారు. ఘటనలో పోలీసులు సైతం విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఘర్షణకు సంబంధించి కేసులు నమోదైతే భవిష్యత్ అంతా పాడవుతుందని మరోమారు ఇలాంటి ఘటనలకు చోటివ్వరాదంటూ సూచించారు. ఘటనపై ఆర్సీఓ ఫ్లోరెన్సాణి, ప్రిన్సిపాల్ శ్రీధర్రావులు మాట్లాడుతు విద్యార్థుల మద్య జరిగిన చిన్న ఘర్షణ అని వివరించారు. ఇంటర్ పరీక్షలు ముగియటంతో గొడవకు కారణమయిన విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు.
ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ టెన్త్ విద్యార్థిపై ఇంటర్ విద్యార్థి దాడి.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోచమ్మ గుట్ట తాండ దగ్గర. ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ బాయ్స్ లో నిన్న రాత్రి ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది.
క్లాస్ రూమ్ లో జరిగిన సంఘటనలు మనసులో పెట్టుకొని విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు సమాచారం.
విద్యార్థులు దాడి చేసుకుంటున్నా సంఘటన సీసీ కెమెరాలు రికార్డు అయింది.
ఇద్దరి విద్యార్థులని వెంటనే మందలించి వారి తల్లిదండ్రులను పిలిపించి ఇద్దరి సమక్షంలో రాజీ కుదుర్చారు.
అలాగే ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లో ర్యాగింగ్ అని వైరల్ చేస్తుండడం దురదృష్టం అది అబద్ధం ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అని ప్రిన్సిపల్ అన్నారు.
ఇలాంటి సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపా
ల్ తెలిపారు.
ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ టెన్త్ విద్యార్థిపై ఇంటర్ విద్యార్థి దాడి. సామాజిక మాధ్యమాల్లో ర్యాగింగ్ అని వైరల్ చేస్తుండడం దురదృష్టం అది అబద్ధం ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అని ప్రిన్సిపల్ అన్నారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోచమ్మ గుట్ట తాండ దగ్గర. ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ బాయ్స్ లో నిన్న రాత్రి ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది.
క్లాస్ రూమ్ లో జరిగిన సంఘటనలు మనసులో పెట్టుకొని విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు సమాచారం.
విద్యార్థులు దాడి చేసుకుంటున్నా సంఘటన సీసీ కెమెరాలు రికార్డు అయింది.
ఇద్దరి విద్యార్థులని వెంటనే మందలించి వారి తల్లిదండ్రులను పిలిపించి ఇద్దరి సమక్షంలో రాజీ కుదుర్చారు.
అలాగే ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లో ర్యాగింగ్ అని వైరల్ చేస్తుండడం దురదృష్టం అది అబద్ధం ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అని ప్రిన్సిపల్ అన్నారు.
ఇలాంటి సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ తెలిపారు.