రికార్డు స్థాయిలో కరెంటు సరఫరా
విద్యుత్ సరఫరా లో తెలంగాణ డిస్కంలు కొత్త రికార్డు సృష్టించాయి.
రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు డిస్కంల పరిధిలో మార్చి 6 వ తేదీన 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాయి.
గత ఏడాది మార్చి 14న 297.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా ఇప్పటి వరకు అత్యధిక రికార్డుగా ఉండేది.
బుధవారం రోజున రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి కొత్త ప్రభుత్వం గత రికార్డులను అధిగమించింది.
ఫిబ్రవరి, మార్చి నెలల్లో అత్యధిక డిమాండ్ ఉన్నపటికీ విద్యుత్ సంస్థలు దానికి తగిన విధంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశాయి.
2. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్.. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్‌కు హాజరుకానున్న రేవంత్, ఉత్తమ్..
3. సీడ్ కార్పొరేషన్లో జరిగిన
అవకతవకలపై మంత్రి తుమ్మల సీరియస్....
తక్షణమే సీడ్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ ను తొలగించాలని వ్యవసాయ శాఖ కార్యదర్శికి ఆదేశం....
కోపరేటివ్ రిజిష్టార్ హరిత IAS కు అదనపు భాద్యతలు....
సీడ్ కార్పొరేషన్ లో జరిగిన అవకతవకలపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు....
4. నేడు ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
కేంద్రమంత్రులు ప్రహ్లాద్‌జోషి, రాజ్‌కుమార్ సింగ్‌తో భేటీకానున్న భట్టి..
పర్యావరణం, అటవీశాఖ కార్యదర్శులను కలవనున్న భట్టి విక్రమార్క..