ఘనంగా సంక్రాంతి సంబరాలు
స్థానిక శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ అంతర్జాతీయ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ముందుగా సర్వదర్శన్ దాస్ స్వామిజి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సంబరాల్లో భాగంగా సంక్రాంతి విశిష్టత గురించి ప్రిన్సిపల్ అమరేందర్ రెడ్డి వివరించడం జరిగింది. సంక్రాంతి సంబరాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు రంగవల్లి పోటీలను నిర్వహించారు ఆచార వ్యవహారాలను ఈ తరంవారు మర్చిపోకుండా చేస్తూ వచ్చే తరాలకు మన సంస్కృతిని అందజేయాలనే సదుద్దేశంతో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు కోఆర్డినేటర్ రాఘవాదిత్య, సాయి లక్ష్మి తమ ప్రసంగంలో వివరించారు.
రంగవల్లి పోటీలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని డైరెక్టర్ భావిష్ అభిప్రాయపడ్డారు.
ముగ్గుల పోటీతోపాటు గోపూజ, భోగిమంటలు, విద్యార్థులు గాలిపటాలను ఎగరవేసి సంక్రాంతి సంబరాలకు మరింత శోభను చేకూర్చారు.
పూర్తిగా పండుగ వాతావరణంలో అద్యంతం ఆనందోత్సాహాలతో కొనసాగిన ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయురాలు శ్రావణి వ్యాఖ్యాతగా వ్యవహరించగా ...
ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారిని బహుమతులతో పాటు ఘనంగా సన్మానించారు.
సంబరాలలో భాగంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడంతోపాటు సంక్రాంతి వైభవాన్ని తెలుగువారి తెలుగు తనాన్ని తమ ప్రసంగాలలో తెలియజేశారు.
సౌభాగ్యానికి ఆలవాలమైన సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన పండుగలు ఐక్యతకు సహృదయతకు విశాల దృక్పథానికి
ఆలవాలమని పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ శుభ సందర్భంగా అందరికీ మిఠాయి పంపిణీ చేశారు.
