విద్యుత్ షాట్ సర్క్యూట్ తో రూ. 20 లక్షల ఆస్థి నష్టపోయిన బొల్లం సైదులు
నిరాశ్రయులైన రైతు కుటుంబం
వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ బానోతు రాము
పాలేరు నియోజకవర్గం,
కూసుమంచి మండలంలోని చేగొమ్మ గ్రామానికి చెందిన బొల్లం సైదులు అనే సన్నకారు రైతు ఇంట్లో జరిగిన విద్యుత్ షాట్ సర్క్యూట్ మూలంగా ఇంట్లో ఉంచబడిన సుమారు 100 క్వింటాల పత్తి,65 బస్తాల వడ్లు, ఇంట్లో ఉన్న సమస్త వస్తువులు కాలిపోయి బూడిద పాలైనాయి. గ్రామస్థులు తెలిపిన వివరాలు ప్రకారం బొల్లం సైదులు కు తనకు ఉన్న నాలుగు ఎకరాల భూమితో పాటు కొంత భూమిని కౌలుకు తీసుకొని సేద్యం చేయుచున్నారు. ఈ మధ్యకాలంలో పత్తి పంట పక్వానికి రాగా కూలీలతో పత్తి తీత పనులను పూర్తి చేసి రేటు ఆశాజానాకంగా లేక పోవడంతో సుమారు 100 క్వింటాల పత్తిని ఇంట్లోనే నిలువ చేశారు. అదే విధంగా సుమారు 65 బస్తాల వరి దాన్యాన్ని కూడా నిలువ చేశారు. వ్యవసాయ పనులు ఇంకో వారం రోజుల్లో పూర్తి కాగానే ఈ లోగా సంక్రాతి పండుగ తరువాత తమ పంటను అమ్మి కౌలుకు, పెట్టుబడులు పెట్టిని వారి భాకీలు తీరుద్దామని పుట్టెడు ఆశతో ఉన్నాడు. ఈ లోగా మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో నుండి మంటలు వ్యాపించటం తో పరిసర ప్రాంతాల ప్రజలు గమనించి అగ్నిమాపక సిబ్బంది కి సమాచారం అందించారు. స్పందించిన అధికారులు ఫైర్ ఇంజన్ తీసుకొచ్చే లోపే మంటలు నలుధిక్కుల వ్యాపించి ఇంటికి కూడా అంటుకొనిఉండగా వెంటనే ఫైర్ సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలు అదుపుచేసే లోపే ఆ ఇంట్లోని పత్తి, ధాన్యం, ఇంట్లోని బట్టలు, వంట సామాగ్రి, పలు ఎలక్ట్రానిక్ వస్తువు ఒకటేమిటి మంచాలు, ఫర్నీచర్ అంతా సమస్తం కాలిపోయాయి.వాసలతో ఉన్న పెంకు టిల్లు కూడా మంటల వ్యాప్తికి పాక్షికంగా కాలిపోయింది. మంటలు వ్యాపిస్తున్న ప్రారంభ దశలో కొద్ది మంది యువకులు దైర్యం చేసి ఇంట్లోకి వెళ్లి గ్యాస్ సిలెండర్ బయటకు తీసుకొని రావడం మూలంగా పెను ప్రమాదం తప్పింది.పగలు కావడంతో కుటుంబ సభ్యులు బయటకు పనులకు వెళ్ళటంతో ప్రాణలు మిగిలాయి.సుమారు 20 లక్షల రూపాయల ఆస్థి నష్టం జరిగింది. అంతేకాకుండా తన సోదరుడి బిడ్డ వివాహం నిశ్చయం అయిన కారణంగా ఇంట్లో 6 లక్షల రూపాయలు కూడా ఈ సంఘటనలో దగ్ధమైపోయినయయి.
దీంతో విషయం తెలుసుకొన్న భాధితులు ఇంటికి వచ్చి చూడగానే అక్కడ భూడిద తప్ప ఇంటి ఆనవాళ్లు లేకుండా పోయాయని కన్నీళ్ళపర్యాంతమైయ్యారు. మాకు కట్టుబట్టలు తప్ప ఏమి మిగలలేదని చేస్తున్న రోదనలు ప్రతీ ఒక్కరి మనసు కలిచివేసింది.మేము బ్రతికేది ఎట్లా, కౌలు డబ్బులు, అప్పులు ఎలా చెళ్లిస్తామని రోదిస్తున్నారు.విద్యుత్ షాట్ సర్క్యూట్ మూలంగానే మంటలు వ్యాపించి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. మండల అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించి బొల్లం సైదులును ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఈ సంఘటన తెలియగానే కుసుమంచి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ బానోతు రాము సంఘటన స్థలికి చేరుకొని పంచనామా నిర్వహించి ఎంత మేరకు నష్టం వాటిల్లిందో అంచనా వేస్తామని ఈ సందర్భంగా బాధితులకు తెలియజేశారు.
