జడ్చర్ల లోని డిగ్రీ కళాశాలలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు #VIRAL

 జడ్చర్ల లోని డిగ్రీ కళాశాలలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు



నేడు దేశవ్యాప్తంగా సుభాష్ చంద్రబోస్ కు ఘనంగా జయంతి దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్సిసి విద్యార్థులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు కాలేజీ ప్రాంగణం నుంచి సింగల్ గడ్డలకు ర్యాలీ నిర్వహించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు జై అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. 



మీ రక్తాన్ని నాకు ఇవ్వండి నేను దేశానికి స్వతంత్రం తెస్తాను అని దేశం కానీ దేశంలో ఆజాద్ హింద్ సంస్థను స్థాపించిన నాయకుడు అతని ఆశయాల సాధన కోసం నేటి యువత ముందుకు సాగాలి అని కళాశాల ప్రిన్సిపాల్ అప్పియ చిన్నమ్మ అన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కళాశాల లెక్చరర్ శ్రీనివాస్ మరియు లెఫ్టినెంట్ ఏ యాదయ్య మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ప్రొఫెసర్లు ఎన్సిసి విద్యార్థులు పాల్గొన్నారు

Previous Post Next Post

نموذج الاتصال