ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నిర్వహిస్తాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Caption of Image.

నల్లగొండ:  గత ప్రభుత్వంలో జరిగినట్టు పేపర్ లీక్ లు లేకుండా UPSC తరహాలో గ్రూప్స్ పరీక్షలను నిర్వహిస్తామని.. ఫిబ్రవరిలో మెగా డీఎస్సీని నిర్వహించబోతున్నట్లు చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.  నిరుద్యోగులకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని తెలిపారు. జనవరి 17వ తేదీ బుధవారం  నల్గొండ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. 

జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనతో కలిసి శివాజీనగర్ సెంటర్ నుంచి పానగల్ రోడ్డు వరకు 90 లక్షల రూపాయల NCAP నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు, NG కళాశాల నుంచి రామగిరి వరకు కోటి 30 లక్షల రూపాయల నిధులతో విస్తరిస్తున్న బీటీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 
పట్టణంలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ సెంటర్ ని పరిశీలించిన మంత్రి చేపట్టాల్సిన మార్పుల గురించి కలెక్టర్ కి పలు సూచనలు చేశారు. అనంతరం  ఆర్డీఓ కార్యాలయంలో 244 మంది లబ్దిదారులకి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణి చేసి మాట్లాడారు

నల్గొండ ప్రజలు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి నాపై పెద్ద బాధ్యత పెట్టారన్నారు మంత్రి. రాబోయే రోజుల్లో నల్గొండ నలువైపులా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తామని హామీ ఇచ్చారు. పాత ప్రభుత్వంలో ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినట్టు .. కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా లబ్ధిదారులకి సంక్షేమ ఫలాలను అందిస్తామని తెలిపారు.  ఆరోగ్యశ్రీని ఇప్పటికే 10 లక్షల రూపాయలకి పెంచామని.. మిగతా గ్యారంటీలను 100 శాతం అమలు చేస్తామని స్పష్టం చేశారు. క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని కల్యాణలక్ష్మి, షాదీముబారక్  ఆర్థిక  సహాయంతో పాటు తులం బంగారంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అధికారులు పేదల్ని ఇబ్బంది పెట్టకుండా వారికి అండగా నిలవాలని సూచించారు. 

©️ VIL Media Pvt Ltd.


from V6 Velugu https://ift.tt/1pTAZnC
via IFTTT
Previous Post Next Post

نموذج الاتصال