ఛాయ్ వాలా ప్రధాని... బిజెపిలో మాత్రమే సాధ్యం...
పేదరికం నుంచి వచ్చాడు కాబట్టే పేదల కష్టాలు ప్రధానికి తెలుసు
నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని అయితే ఈ దేశం రూపురేఖలు మారిపోతాయి
కేంద్ర ప్రభుత్వ పథకాలను పేదలకు అందేలా చేయడమే మా ధ్యేయం
- వికసిత భారత్ సంకల్ప యాత్రలో బిజెపి రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్
కోస్గి, నారాయణపేట జిల్లా:
చాయ్ వాలా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఒక్క బిజెపి ద్వారా మాత్రమే సాధ్యమని బిజెపి రాష్ట్ర కోశాధికారి బండారి శాంతి కుమార్ అన్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మోదీకి పేద ప్రజల కష్టాలు బాగా తెలుసని అందుకే పేద ప్రజల అభ్యున్నతి కోసం ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
కోస్గి మండలంలోని చెన్నారం గ్రామంలో ఏర్పాటు చేసిన వికసిత భారత్ కార్యక్రమంలో శాంతికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో పాయింట్ లో ఫోటో దిగి వికసిత భారత్ బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు.
ఈ సందర్భంగా శాంతి కుమార్ మాట్లాడుతూ... నరేంద్ర మోడీ మరొక్కసారి ప్రధానమంత్రి అయితే ఈ దేశం సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటిని ప్రజలకు మరింత చేరువాయేలా చేస్తామని పేర్కొన్నారు. వికసిత భారత్ సంకల్ప యాత్ర లక్ష్య సాధనలో ప్రజలే ప్రచారకర్తలని, అర్హత ఉన్న ఏ ఒక్కరూ ప్రభుత్వ పథకాల లబ్ధి పొందకుండా మిగిలిపోకూడదనే గొప్ప లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారని అన్నారు. వివక్షకు తావులేకుండా సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ నినాదంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు.
ఈ సందర్భంగా... వికసిత భారత్ సంకల్ప యాత్ర ఔన్నత్యంపై ప్రధాని నరేంద్రమోదీ సందేశాన్ని వీడియో ద్వారా ప్రజలతో కలిసి శాంతి కుమార్ తిలకించారు. అనంతరం స్థానికులకు ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. అలాగే వికసిత భారత్ క్యాలెండర్, బుక్లెట్ ను విడుదల చేసి గ్రామస్తులకు అందజేశారు.
కార్యక్రమంలో నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్, కొడంగల్ అసెంబ్లీ కో కన్వీనర్ కోటకొండ రాము, నారాయణ రెడ్డి, భాస్కర్, శ్రీకాంత్, ఎర్రం మల్లేష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
