*తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఉత్కంఠ*
హైదరాబాద్:జనవరి 05
ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోన్నది. పార్టీలో క్రీయాశీలకంగా పనిచేసిన నేతల వివరాలను ఏఐసీసీ సేకరిస్తున్నది. దాదాపు 15 మంది కీలక నేతలు ఎమ్మె ల్సీ పదవుల కోసం పోటీ పడుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది.
అయితే అసెంబ్లీ టిక్కెట్‌ను త్యాగం చేసినోళ్లకు అవకా శం ఇస్తారా? పోటీ చేసి ఓడిన ప్రముఖులకు కేటాయిస్తారా? అనేది త్వరలోనే తేలనున్నది. ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీలు ఖాళీ అవగా, ఇప్పుడు ఆ రెండింటికీ ఆశావహులు పోటీపడు తున్నారు.
దీంతో కాంగ్రెస్ ఇద్దరి అభ్యర్ధులను నిలబెడు తుందా? ఒక్కరినే పోటీ లో ఉంచుతుందా? అని పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొన్న ది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ల సంఖ్య ప్రకారం కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీని సులువుగా గెలుస్తుంది.
తమకూ ఒక ఎమ్మెల్సీ వస్తుందని బీఆర్ఎస్ ధీమాను వ్యక్తం చేస్తున్నది. అయితే రెండింటినీ తామే గెలవాలని కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పట్టుపడు తున్నారు.
ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యతో రెండింటినీ గెల వడం కష్టమే. కానీ ఇతర పార్టీ ఎమ్మెల్