మకర వీళ్ళకే దగ్గర పడుతున్న కొద్ది అయ్యప్ప దగ్గరికి వచ్చే భక్తులు రోజురోజుకు పెరిగిపోతున్నారు.
చెంగనూరు నుంచి కొట్టాయం నుంచి నిలకల్ మీదుగా పంబకు అయ్యప్ప భక్తులు పోటెత్తారు.
పంబ నది వంతెన దగ్గర నుండి కన్నె మాల మహా గణపతి వరకు అయ్యప్పలు వేచియున్నారు.
క్షణక్షణానికి నది ప్రవాహం పెరిగినట్లు అయ్యప్పలు పెరుగుతుండడం అలాగే మండల కాలం దీక్షలు చేసి ఇరుముడులు కట్టుకొని వేల సంఖ్యలో అయ్యప్పలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ కర్ణాటక మరియు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో వస్తున్నది మొత్తం అయ్యప్పలతో కిట కిటలుడతుంది ఆడుతుంది.
జనార్దన్ గురుస్వామి ఆధ్వర్యంలో మూడు తారీఖు నాడు సింహగిరి కొత్త గంజి నుండి బయలుదేరిన అయ్యప్ప స్వాములు నేడు పంబ నదికి చేరుకున్నారు.
ఇక్కడ సౌకర్యాలు అంతంత మాత్రమే ఉండడంతో మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చిన చాలామంది అయ్యప్ప భక్తులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

