TS Assembly: రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

 



రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ( Telangana Assembly ) సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ( Akbaruddin Owaisi ) తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

హైదరాబాద్: రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ( Telangana Assembly ) సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ( Akbaruddin Owaisi ) తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. స్పీకర్‌ ఎన్నిక వరకూ ప్రొటెం స్పీకర్‌ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. రేపు.ఉదయం 8:30 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ప్రమాణం చేయనున్నారు.



అయితే రేపు అసెంబ్లీ వాయిదా తర్వాత అసెంబ్లీ ప్రాంగణం నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీంను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నిమ్స్‌కు వెళ్లి ఆరోగ్యశ్రీ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పది లక్షలతో ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం విదితమే. అక్కడి నుంచి నిమ్స్‌కు వెళ్లి ఆరోగ్యశ్రీ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow