TS News: వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
పూడూరు మండలం రాకంచెర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్- బీజాపూర్ ప్రధాన రహదారిపై ఆగి ఉన్న సిమెంటు ట్యాంకర్‌ని బొలెరో వాహనం ఢీకొట్టింది.
వికారాబాద్ : పూడూరు మండలం రాకంచెర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్- బీజాపూర్ ప్రధాన రహదారిపై ఆగి ఉన్న సిమెంటు ట్యాంకర్‌ని బొలెరో వాహనం ఢీకొట్టింది. ఓ శుభ కార్యానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారందరూ ఒకే గ్రామానికి చెందిన వారు. క్షతగాత్రులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులను హైదరాబాద్‌కు తరలించారు.
హైదరాబాద్ : మూడో శాసనసభలో మొదటి అసెంబ్లీ సమావేశం నేటి ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ప్రోటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసి ఎన్నికయ్యారు. కొత్త ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ సారి అసెంబ్లీకి కొత్తగా 51 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికైన ప్రతీ ఎమ్మెల్యే గెలిచిన పత్రం రెండు కాపీల జిరాక్స్, రెండు ఫోటోలు తేవాలని అసెంబ్లీ సెక్రెటరీ ఆదేశాలు జారీ చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెం స్పీకర్‌గా ఎన్నిక వల్ల బీజేపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తరువాత స్పీకర్ ఎన్నిక నోటిఫకేషన్ వెలువడనుంది.
Hyderabad: న్యూ ఇయర్ వేడుకలే టార్గెట్.. మూతబడ్డ పరిశ్రమల్లో గుట్టుగా డ్రగ్స్ తయారీ
న్యూ ఇయర్ వేడుకల్లో జోరుగా డ్రగ్స్(Drugs) సరఫరా చేయాలని ఓ ముఠా సిద్ధమైంది. ఇందుకోసం మూతబడ్డ పరిశ్రమల్లో
న్యూ ఇయర్ వేడుకల్లో జోరుగా డ్రగ్స్(Drugs) సరఫరా చేయాలని ఓ ముఠా సిద్ధమైంది. ఇందుకోసం మూతబడ్డ పరిశ్రమల్లో డ్రగ్స్‌ను నిల్వచేసుకుంది. ఈ విషయంపై దృష్టి సారించిన తెలంగాణ నార్కోటిక్ బ్యూరో (టి-న్యాబ్) అధికారులు ఎట్టకేలకు వారి ఎత్తులను చిత్తుచేశారు. ముఠా సభ్యులను అరెస్ట్ చేసి సుమారు 3కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇన్నాళ్లు ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో సరఫరా చేయగా, కొందరు ఇక్కడే తయారీకి తెరలేపారు. శివారు ప్రాంతాలైన రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్, సంగారెడ్డి పరిధిలోని పారిశ్రామిక కేంద్రాల్లో కొన్ని మూతపడ్డ పరిశ్రమలను ఎంచుకుని వాటిలో గుట్టుగా డ్రగ్స్‌ను తయారు చేస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ తంతు కొనసాగుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో నార్కోటిక్ బ్యూరో అధికారులు డ్రగ్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. సంగారెడ్డి(Sangareddy) జిల్లా జిన్నారం మండలం పరిధిలో మూతపడ్డ పరిశ్రమలో గుట్టుగా డ్రగ్స్‌ను తయారు చేస్తున్నట్లు టీ న్యాబ్‌కు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ క్రమంలో జిన్నారం పోలీసులతో కలిసి సంయుక్తంగా ఆ పరిశ్రమపై దాడిచేశారు. 14 కేజీల డ్రగ్స్, పసుపు రంగు పొడి-4 కేజీలు, వైట్ టికాకా పొడి-3 కేజీలు, ల్యాబ్‌లో వినియోగించే పరికరాలు, డ్రగ్స్ తయారీలో వాడే కెమికల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సరుకు విలువ రూ. 3 కోట్లు ఉంటుందని వెల్లడించారు. ఈ ముఠా గతంలో ఇలాగే మూతపడిన పరిశ్రమల్లో డ్రగ్స్ తయారు చేసి డీఆర్‌డీఏ అధికారులకు చిక్కింది. ఆ తర్వాత జైలునుంచి బయటకు వచ్చిన తర్వాత వీలు చిక్కినప్పుడల్లా ఇలా డ్రగ్స్‌ను తయారు చేసి ఇతర రాష్ట్రాల్లోని నగరాలకు గుట్టుగా సరఫరా చేసి విక్రయిస్తోంది.
- నాచారంలో మరో ముఠా
నాచారం పారిశ్రామిక వాడలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలోనూ మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్న ముగ్గురు సభ్యులు ముఠాను ఇటీవల రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.30లక్షల విలువైన డ్రగ్‌తో పాటు ఇతర కెమికల్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 2014లో నాచారంలో ఫార్మా సంస్థను ప్రారంభించిన నిందితులు. 2019లో దాన్ని ఐడీఏ ఉప్పల్‌కు మార్చారు. అడ్డదారిలో డబ్బు సంపాదించాలనే ఉద్ధేశంతో డ్రగ్‌ను తయారు చేయడం ప్రారంభించారు. తయారు చేసిన డ్రగ్‌ను చెన్నైకి చెందిన స్మగ్లర్ నెపోలియన్ సహకారంతో ఇతర దేశాలకు ఎగుమతి చేసి రూ. లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నారు. ఉప్పల్ ఐడీఏ శివారు ప్రాంతంలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు తెలుసుకున్న రాచకొండ స్పెషల్ పోలీసులు కెమికల్ కంపెనీపై దాడి చేసి పట్టుకున్నారు.


.webp)